Read News in Telugu Language
adsdaksha

హైదరాబాద్ లో ఎన్ఐఏ సోదాలు.. వీక్షణం ఎడిటర్ వేణుగోపాల్ ఇంట్లో తనిఖీలు..

దక్ష న్యూస్, హైదరాబాద్: ఫిబ్రవరి 8

హైదరాబాద్ నగరంలోని పలుచోట్ల ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది. వీక్షణం ఎడిటర్ ఎన్. వేణుగోపాల్ నివాసంలో ఎన్ఐఏ తనిఖీలు చేసింది. తెల్లవారుజాము 4 గంటల నుంచి మొదలుకొని సుమారు ఐదు గంటల పాటు ఎన్ఐఏ ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించింది.

Read also: బీఆర్ఎస్ కు మరో ఎదురుదెబ్బ.. వరంగల్ జిల్లా యువనేత దాస్యం అభినవ్ రాజీనామా..

ఇటీవల మావోయిస్ట్ సెంట్రల్ కమిటీ సభ్యుడు దీపక్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీపక్ దగ్గర దొరికిన సమాచారం మేరకు వేణు నివాసంలో ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది. అయితే పౌరహక్కుల నేత రవిశర్మ ఇంట్లోను ఎన్ఐఏ సోదాలు చేసింది. రవిశర్మ సెల్ ఫోన్, బుక్లెట్, కరపత్రాలను ఎన్ఐఏ స్వాధీనం చేసుకుంది. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న నేపథ్యంలో ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది. అయితే ఎన్ఐఏ సోదాలపై వేణు గోపాల్ స్పందించారు. నయీమ్ బెదిరింపు లేఖలపై పుస్తకాలు రాశాను అన్నారు. ఆ పుస్తకాలను, నా మొబైల్ ఫోన్ను ఎన్ఐఏ అధికారులు స్వాధీనం చేసుకున్నారని ఎలాంటి నోటీసు ఇవ్వలేదన్నారు.

Hospital

Read also: 15 రోజుల్లో 15వేల పోలీసు ఉద్యోగాలు .. 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాది : సీఎం రేవంత్ రెడ్డి ..

దీపక్ నాకు సంబంధం ఉందని ఎన్ఐఏ సోదాలు నిర్వహించిందని.. తన పేరును ఎఫ్ఎఆర్ ఎందుకు చేర్చారో తెలియదని వేణుగోపాల్ అన్నారు. ఇదే అంశమై ఇప్పటికే కోర్టులో పిటిషన్ వేశా అన్నారు. తాను ప్రస్తుతం విరసం (విప్లవ రచయితల సంఘం)లో లేను అని వేణుగోపాల్ వెల్లడించారు.

పత్రిక ప్రకటన ద్వారా ఎన్ఐఏ దాడులకు సంబంధించి పూర్తి వివరాలు తెలియజేస్తామని ఎన్ఐఏ అధికారులు పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.