Read News in Telugu Language
adsdaksha

పసిడి ధరలు పైపైకి.. పెరిగిన బంగారం, వెండి ధరలు..

దక్ష న్యూస్, హైదరాబాద్: ఫిబ్రవరి 2

మళ్లీ పసిడి ధరలు పైపైకి చేరుతున్నాయి. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం గురువారం మధ్యంతర బడ్జెట్ నేపథ్యంలో బంగారం, వెండి ధరలు పెరగడం ఆసక్తికరంగా మారింది. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ( nirmala seetharaman ) పార్లమెంట్ లో పెట్టిన బడ్జెట్ పద్దులో కస్టమ్స్ పన్ను..ఎగుమతులు, దిగుమతుల పన్నులపై ఎలాంటి మార్పు చేయలేదు. అయినా.. బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. తాజాగా పెరిగిన ధరలతో ఫిబ్రవరి 2వ తేదీ శుక్రవారం తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి. హైదరాబాద్ (Hyderabad) లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.150 పెరగడంతో రూ.58,300లకు చేరింది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై కూడా రూ.160 పెరగ్గా 24 క్యారెట్ల గోల్డ్ తులం రూ.63,600లు పలుకుతోంది.

Hospital

Read also: సోరెన్ కు చుక్కెదురు.. జార్ఖండ్ మాజీ సీఎం బెయిల్ పిటిషన్ ను తోసిపుచ్చిన సుప్రీం..

మరోవైపు కిలో వెండి ధరపై 200 రూపాయలు పెరిగి రూ.76,5000గా ఉంది. ఆంధ్రప్రదేశ్ విజయవాడ (Vijayawada) లోనూ బంగారం, వెండి ధరలు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.150 పెరిగి రూ.58,300లకు చేరింది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై కూడా రూ.160 పెరిగి రూ.63,600లకు చేరుకుంది.

Leave A Reply

Your email address will not be published.