Read News in Telugu Language
adsdaksha

నామినేటెడ్ జాతర షురూ .. 37 కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకం ..

దక్ష న్యూస్, హైదరాబాద్ : మార్చి 18

తెలంగాణ రాష్ట్రంలో నామినేటెడ్ పదవుల జాతర షురూ అయ్యింది. తెలంగాణలో ఖాళీగా ఉన్న నామినేటెడ్‌ పదవులను సర్కార్ భర్తీ చేసింది. మొత్తం 37 కార్పొరేషన్లకు ఛైర్మన్లను నియమిస్తూ ఈ నెల 14వ తేదీనే ప్రభుత్వ ఉత్తర్వులు జారీచేసింది. నామినేటెడ్‌ పదవుల జాబితాలో పార్టీలో చురుగ్గా పనిచేసి సేవలందించిన వారిని సీఎం రేవంత్‌ రెడ్డి ఈ పదవులకు ఎంపిక చేశారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయానికి కష్టపడి పనిచేసిన వారికి గుర్తింపునిస్తూ పదవులిచ్చారు. ఇందులో ప్రధానంగా నల్గొండ ఎంపీ టికెట్ ఆశించి భంగపడ్డ పటేల్ రమేష్ రెడ్డికి టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పదవిని కట్టబెట్టారు.

read also : నేటి నుండి విదేశీ మీడియా ప్రతినిధుల బృందం పర్యటన.. హైదరాబాద్ చేరుకున్న 22 మంది పాత్రికేయులు..

మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్యకు అటవీ అభివృద్ధి సంస్థ, గుర్నాథ్ రెడ్డికి పోలీసు గృహనిర్మాణ సంస్థ, జగ్గారెడ్డి సతీమణి నిర్మలకు పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ, కాల్వ సుజాతకు వైశ్య సంస్థ ఛైర్మన్ పదవులు దక్కాయి. త్వరలో జరగనున్న పార్లమెంటు ఎన్నికల్లో వీరు మరింత ఉత్సాహంగా పనిచేయడానికి పదవుల భర్తీ ఉపకరిస్తుందని పార్టీ భావిస్తోంది. కాగా.. కార్పొరేషన్ చైర్మన్లలో ప్రధానమైన ఆర్టీసీ, ప్రెస్ అకాడమీ, సివిల్ కార్పొరేషన్‌, రెడ్కో ఛైర్మన్‌ తదితర కార్పొరేషన్ ఛైర్మన్ నియామకాలను హోల్డ్‌లో పెట్టారు.

 

read also : గ్రూప్ 1 దరఖాస్తులు 4.03 లక్షలు..సవరణకు మార్చి 23 నుంచి 27 వరకు అవకాశం ..

 

ఎవరికీ ఏయే కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవులు దక్కాయంటే..

1. నూతి శ్రీకాంత్ – బీసీ ఆర్ధిక సంస్థ

2. శివసేన రెడ్డి – తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ

3. గుర్నాథ రెడ్డి – పోలీస్ గృహ నిర్మాణ సంస్థ

4. పటేల్ రమేష్ రెడ్డి – పర్యాటక అభివృద్ధి సంస్థ

5. రాయల నాగేశ్వరరావు – వేర్‌హౌస్ కంపెనీ

6. నెరెల్ శారద – మహిళా కమిషన్

7.ఎన్. ప్రీతమ్ – ఎస్సీ కార్పొరేషన్

8. బెల్లయ్య నాయక్ (గిరిజన సహకార సంఘం)

9. రియాజ్ – లైబ్రరీ పరిషత్

10. మెట్టు సాయికుమార్ – ఫిషరీస్ కో-ఆపరేటివ్ సొసైటీస్ ఫెడరేషన్

11. జగదీశ్వరరావు – నీటిపారుదల అభివృద్ధి

12. జంగా రాఘవరెడ్డి – ఆయిల్ ఫెడ్

13. అనిల్ – మైనింగ్ కార్పొరేషన్

14. జ్ఞానేశ్వర్ – విజయ డెయిరీ

15. ఎం.విజయబాబు – స్టేట్ కోఆపరేటివ్ హౌసింగ్ అసోసియేషన్

Hospital

16. బండ్రు శోభారాణి – మహిళా సహకార అభివృద్ధి సంస్థ

17. నిర్మల – ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్

18.ఎం. మోహన్ రెడ్డి -రాష్ట్ర సహకార సంఘం

19. ఎస్. అన్వేష్ రెడ్డి – విత్తనాభివృద్ధి సంస్థ

20. కాసుల బాలరాజు – ఆగ్రోస్ కంపెనీ

21. జనక్ ప్రసాద్ – కనీస వేతనాల సలహా మండలి

22. ఎం. వీరయ్య – వికలాంగుల సంస్థ

23. మల్ రెడ్డి రామ్ రెడ్డి – రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్

24.పి. వీరయ్య – అటవీ అభివృద్ధి సంస్థ

25. చల్లా నరసింహా రెడ్డి – అర్బన్ ఫైనాన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్

26.ఎన్. సత్యనారాయణ – హస్తకళల సంస్థ

27. ఎంఏ జబ్బార్ – మైనారిటీ ఆర్థిక సంస్థ

28. కాల్వ సుజాత – వైశ్య సంస్థ

29. కె. నాగు – గిరిజన సహకార మరియు ఆర్థిక అభివృద్ధి సంస్థ

30.ఎ. ప్రకాష్ రెడ్డి – స్టేట్ ట్రేడింగ్ ప్రమోషన్ కార్పొరేషన్

31. జైపాల్ – అత్యంత వెనుకబడిన తరగతుల అభివృద్ధి సంస్థ

32.ఎన్. గిరిధర్ రెడ్డి – ఫిల్మ్ డెవలప్‌మెంట్ కంపెనీ

33.ఎంఏ ఫహీమ్ – తెలంగాణ ఫుడ్స్

34. మన్నె సతీష్ – స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్

35. పి. అలేఖ్య – సంగీత నాటక అకాడమీ

36.కె. నరేందర్ రెడ్డి – శాతవాహన పట్టణాభివృద్ధి సంస్థ

37. వెంకట్రామ్ రెడ్డి – కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ

Leave A Reply

Your email address will not be published.