Read News in Telugu Language
adsdaksha

ఓటుకు నోటు కేసు విచారణ మరోసారి వాయిదా.. జూలై 24న విచారణ చేపడతామని సుప్రీంకోర్టు స్పష్టం..

దక్ష న్యూస్, హైదరాబాద్ : ఏప్రిల్ 18

మరో రెండు వారాల్లో సుప్రీంకోర్టు కు వేసవి సెలవులు వస్తున్న నేపధ్యంలో సుప్రీం కోర్టు ఓటుకు నోటు కేసు ( note for vote case ) విచారణ మరోసారి వాయిదా వేసింది. ఓటుకు నోటు వ్యవహారంపై సీబీఐ ( cbi ) విచారణ చేపట్టాలన్న మంగళగిరి ( mangalhagiri ) ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ( alla ramakrishnareddy ) పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. వేసవి సెలవుల అనంతరం కేసు విచారణ చేపడతామని జస్టిస్ ఎంఎం సుందరేష్ (justice mm sundaresh ), జస్టిస్ ఎస్విఎన్ భట్టి (justice svn bhatti )ల ధర్మాసనం పేర్కొంది. దీంతో తదుపరి విచారణను జులై 24వ తేదీకి వాయిదా వేసింది. అయితే, ఈ కేసులో చట్టానికి సంబంధించి అనేక అంశాలు ముడిపడి ఉన్నాయని, రెండు వారాల్లో కేసుతో ముడిపడి ఉన్న చట్టపరమైన అంశాలతో కూడిన వివరాలను అందించేందుకు సమయం ఇవ్వాలని తెలంగాణ ( telangana ) ప్రభుత్వం కోరింది.

read also : hayabusa bike : అందుబాటులో కొత్త సుజుకి హయబుసా బైక్.. యానివర్శరీ సెలబ్రేషన్ ఎడిషన్ మోడల్ చూస్తే వావ్ అనాల్సిందే..

ఇదిలా ఉంటే రెండు వారాల తర్వాత సుప్రీంకోర్టు (supreme court ) కు వేసవి సెలవులు వస్తున్నాయని, కేసు విచారణ పూర్తిస్థాయిలో జరగటానికి అవకాశం లేదు కనుక సెలవులు అనంతరం విచారణకు తీసుకోవాలని చంద్రబాబు ( chandrababu ) తరపు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్ర కోర్టును కోరారు.

Hospital

ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న కేసు కావడంతో ప్రతిసారి ఏదో ఒక సాకుతో కేసు విచారణ పడుతూ వస్తోంది. విచారణను త్వరితగతిన చేపట్టాలని ఆళ్ల రామకృష్ణారెడ్డి తరపు సీనియర్ న్యాయవాది బసంత్ సుప్రీం కోర్టును కోరారు. అయితే, తెలంగాణ ప్రభుత్వం తరపు న్యాయవాదులు, చంద్రబాబు తరపు న్యాయవాదుల వాదనలను పరిగణలోకి తీసుకొని సుప్రీంకోర్టు విచారణను వాయిదా వేసింది. కేసుల విచారణలో వాయిదాలు కోరడం సహజం.. అదివేరే కేసుల్లో మీకుకూడా వర్తిస్తుందని బసంత్ కు జస్టిస్ ఎంఎం సుందరేష్ వివరించారు. ఇన్ని సంవత్సరాలు ఆగిన విచారణ రెండు వారాలతో ఏమీ మారిపోదు కాబట్టి.. వేసవి సెలవుల తర్వాత విచారణకు తీసుకుంటామని ధర్మాసనం పేర్కొంది.

read also : Dehydration : ప్రమాదకరంగా పిల్లలలో డీహైడ్రేషన్.. జాగ్రత్తలు పాటించాలంటున్న వైద్యులు..

జూలై చివరి వారంలో విచారణ చేపడతామని సుప్రీం కోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఎవరు ఏఏ అంశాలపై లిఖితపూర్వకంగా ఇవ్వాలనుకుంటున్నారో వాటన్నింటిని అందించాలని, జూలై 24 తరువాత వాయిదాలు కోరవద్దని సుప్రీంకోర్టు ధర్మాసనం సూచించింది. తదుపరి విచారణను సుప్రీంకోర్టు జూలై 24కి వాదాయి వేసింది.

 

Leave A Reply

Your email address will not be published.