Read News in Telugu Language
adsdaksha

జర్నలిస్టుల ఇండ్ల స్థలాలపై ఉద్దేశపూర్వకంగానే కాలయాపన ..

దక్ష న్యూస్, ఖమ్మం: సెప్టెంబర్ 24

ఏ జిల్లాల్లో లేని అనుమతులు ఖమ్మంలో ఎందుకు..

రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు జర్నలిస్టు సంఘాలతో ఆందోళనలు..

విలేకరుల సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు..

ఖమ్మంలో జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వడం ప్రభుత్వానికి ఇష్టం లేకనే ఉద్దేశపూర్వకంగానే కాలయాపన చేస్తున్నారని సిపిఎం ( cpm ) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు ( nunna nageswararao ) ఆరోపించారు. ఆర్ధిక మంత్రి హరీష్ రావు ( harish rao ) ఇలాఖాతో పాటు ఏ జిల్లాల్లో లేని అనుమతులు ఖమ్మం ( khammam ) లోనే ఎందుకనీ అంటూ, ముఖ్యమంత్రి కేసీఆర్ ( cm kcr ) ప్రకటించిన ప్రకారంగానే వెంటనే జర్నలిస్టు ( journalist ) లందరికీ ఉచితంగా ఇండ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఖమ్మం నగరంలోని సుందరయ్య భవన్ ( sundaraiah bhavan ) లో ఆదివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో నున్నా నాగేశ్వరావు మాట్లాడుతూ… జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల విషయంలో తెలంగాణ రాకముందు హామీలు ఇచ్చారు తెలంగాణ ( telangana ) వచ్చాక గత పది సంవత్సరాలుగా హామీలు ఇస్తునేఉన్నారు కానీ సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదన్నారు.

పాత్రికేయ సంఘాలు చాలా కాలంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయని, అదేవిధంగా సిపిఎం పార్టీ కూడా అనేక సందర్భాల్లో ఈ సమస్యను ప్రస్తావించిందన్నారు. జిల్లావ్యాప్తంగా ధర్నా కార్యక్రమం నిర్వహించాం సిపిఎం పార్టీ జర్నలిస్టుల ఇండ్ల స్థలాల సమస్యపై ధర్నా చేసిన రోజే అనేక సంఘాలు సంఘీభావం తెలిపాయని గుర్తు చేశారు. ప్రభుత్వం నుండి కూడా హామీ ఇచ్చారని, రెండు జర్నలిస్ట్ మహాసభల్లో పాల్గొన్నాం అధికార పార్టీ ఎమ్మెల్యేలు జిల్లా మంత్రి హామీ ఇచ్చారు. 3 నెలల్లో సమస్య అయిపోతుందన్నారు. కానీ ఎక్కడ వేసిన గొంగలి అక్కడనే ఉన్నదన్న చందంగా సమస్య మిగిలిపోయిందన్నారు. ఖమ్మంలో బిఆర్ఎస్ సభ నిర్వహించిన సందర్భంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ముఖ్యమంత్రికి వినతిపత్రం ఇచ్చామని, ఆ సభలో సీఎం మాట్లాడుతూ.. కోర్టులో ఆటంకాలు తొలగిపోయాయని జిల్లా కేంద్రంతో పాటు మండలాల వారిగా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సభలోనే మంత్రులు హరీష్ రావు, అజయ్ కుమారులకు ఆదేశాలు ఇచ్చారన్నారు. ఇది జరిగి పది నెలలు కావొస్తున్నా ఇంకా కార్యచరణ దాల్చలేదని దుయ్యబట్టారు. 5 ఎకరాలు అన్నారు, 23 ఎకరాలు అన్నారు, ముఖ్యమంత్రి ఆదేశాలు అన్నారు.. అన్నీ ఆగిపోయాయి. అసలు ఎప్పుడిస్తారో తెలియని పరిస్థితి. జర్నలిస్టులు, వాళ్ళ కుటుంబ సభ్యులు కళ్ళల్లో ఒత్తులేసుకొని ఇళ్ల స్థలాలు ఎదురుచూస్తున్నారన్నారు.

read also : నేడు దుర్గం చెరువు ఎస్టీపీ ని ప్రారంభించనున్న కేటిఆర్..

Hospital

ఎన్నికల సమయం దగ్గర పడుతోందని, ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తే ఇండ్ల స్థలాలు ఇవ్వడం సాధ్యం కాదని నున్నా నాగేశ్వరరావు అందోళన వ్యక్తం చేశారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత హామీలు ఇచ్చినవారు, వాగ్దానం చేసిన వారు ఉంటారనే గ్యారెంటీ లేదు. కనుక మళ్లీ సమస్య మొదటికి వస్తుందన్నారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం ప్రభుత్వానికి ఇష్టం లేకనే ఆలస్యం జరుగుతోందని మనసుంటే మార్గం ఉంటుందన్నారు. అనేక జిల్లాల్లో చాలాచోట్ల జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఉన్నారు. ఆర్థిక మంత్రి హరీష్ రావు తన ఇలాఖాలో కూడా ఇచ్చారు. అక్కడ లేని సమస్య ఇక్కడ ఎందుకు ఉంటుందని ప్రశ్నించారు. అందుకనే ఉద్దేశపూర్వకంగానే బిఆర్ఎస్ ప్రభుత్వం పైకి మాటలు చెప్పినా.. జర్నలిస్టులందరికీ హామీ ఇచ్చినా.. వాగ్దానం చేసినా.. మభ్యపెడుతూనే కాలయాపన చేస్తున్నారన్నారు.

ఎకరం భూమి రిజిస్ట్రేషన్ వేల్యూ 5 లక్షల కంటే ఎక్కడా లేదని, బహిరంగ మార్కెట్లో ప్రైవేట్ భూములు ఎకరానికి 3 నుండి, 5 లేదా 6 కోట్లు ఉంది. కానీ ఆ భూమి రిజిస్ట్రేషన్ వ్యాల్యూ 4 లక్షలే అని నున్నా నాగేశ్వరరావు అన్నారు. అయినా ప్రభుత్వ భూమికి అంత వ్యాల్యూ ఏంటని.. కుంటి సాకులు తప్ప మరేమీ లేదన్నారు.

వాస్తవానికి జర్నలిస్టులు తెల్ల కార్డు ఓల్డర్లు. తక్కువ ఆదాయం ఉన్నవారు నాలుగో తరగతి ఉద్యోగులతో కూడా పోలిక లేదు. ప్రభుత్వం జాప్యం చేయకుండా, కుంటి సాకులు చెప్పకుండా.. నిజాయితీ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే జర్నలిస్టులను ఆదుకోవాలనే ఆలోచన ఉంటే ఆలస్యం చేయకుండా ఇప్పుడే ఉచితంగా ఇండ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.

read also : తెలంగాణ ప్రజలను స్కీంలు, స్కాంలతో దోచుకుంటుంన్నారు.. బండి సంజయ్..

ఈ నెల 30వ తేదిలోపు అధికారిక స్పందన రాకుంటే సిపిఎం పార్టీ చొరవ తీసుకొని అన్ని రాజకీయ పార్టీల వారిని, ప్రజా సంఘాలను, జర్నలిస్టు సంఘాలను సమావేశపరిచి ఆందోళన కార్యక్రమం చేపడతామని నున్నా హెచ్చరించారు.

ఈ విలేకరుల సమావేశంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఎర్రా శ్రీకాంత్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వై విక్రమ్, బండి రమేష్, జిల్లా కమిటీ సభ్యులు ఎర్రా శ్రీనివాసరావు, నండ్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.