Read News in Telugu Language
adsdaksha

త్వరలో జిల్లాలో బిఎస్సీ పారా మెడికల్ కళాశాల.. మంత్రి హరీశ్ రావు..

దక్ష న్యూస్, ఖమ్మం: సెప్టెంబర్ 14:

వైద్య, ఆరోగ్య రంగంలో మానవ వనరుల కొరత తీర్చాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం జిల్లాల్లో ప్రభుత్వ వైద్య కళాశాల ( medical colleges ), నర్సింగ్ (nursing) కళాశాలలు ఏర్పాటు చేస్తున్నదని రాష్ట్ర వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖల మంత్రి తన్నీరు హరీశ్ రావు ( harish rao ) అన్నారు. గురువారం ఖమ్మం (khammam)  రూరల్ మండలం మద్దులపల్లి గ్రామంలో నర్సింగ్ కళాశాల ( nursing colleges ) నిర్మాణ పనులకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ( puvvada ajay kumar ) తో కలిసి శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య మంత్రి మాట్లాడుతూ, 5 ఎకరాల్లో రూ. 25 కోట్లతో నర్సింగ్ కళాశాల, హాస్టల్ భవనాల నిర్మాణం చేపడుతున్నట్లు, ఒక్క సంవత్సరం లోనే పూర్తిచేసి అందుబాటులోకి తేనున్నట్లు తెలిపారు.

స్టాఫ్ నర్సులు అంటే ఆసుపత్రుల్లో ఎక్కువగా కేరళ రాష్ట్రం నుండే ఉండేవారని మంత్రి అన్నారు. రాష్ట్రానికి కావాల్సిన మెడికల్, నర్సింగ్, పారా మెడికల్ సిబ్బంది వుండే వారు కారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇది గ్రహించి, ప్రతి జిల్లాలో మెడికల్, నర్సింగ్ కళాశాలలు ఏర్పాటుచేసిందని ఆయన తెలిపారు. త్వరలో జిల్లాలో బిఎస్సి పారా మెడికల్ కళాశాల మంజూరు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు.

read also : మ‌హిళా లోకాన్ని చైత‌న్య ప‌ర‌చండి ..మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు ..

సీతారామ ఎత్తిపోతల పథకం సీఎం కలల ప్రాజెక్ట్ అని, ఇది పూర్తయితే కాలంతో పనిలేకుండా, సాగర్ లో నీళ్లు రాకపోయినా 2 పంటలకు సాగునీరు అందుతుందని మంత్రి హరీశ్ రావు తెలిపారు. పాలేరు నియోజకవర్గానికి రూ. 125 కోట్ల ఎస్జిఎఫ్ నిధులు మంజూరు అయినట్లు, ఆ నిధులతో గ్రామ గ్రామానికి సిసి రోడ్స్, కమ్యూనిటీ హాళ్లు, అంగన్వాడీ భవనాలు నిర్మించనున్నట్లు తెలిపారు.

Hospital

అనంతరం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ, రాష్ట్రంలో డాక్టర్లు, నర్సుల కొరత ఉన్నట్లు, శిక్షణా నర్సులు చాలా తక్కువ అని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మేల్ నర్సింగ్ చేపట్టి, ప్రతి వైద్య కళాశాల కు అనుబంధంగా నర్సింగ్ కళాశాల ఏర్పాటుచేసినట్లు తెలిపారు. పారా మెడికల్ కోర్సులు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంటే, తక్కువ ఫీజుతో అవకాశాలు వుంటాయని, పేదవాళ్లకు విద్య అందుబాటులో ఉంటుందని ఆయన అన్నారు.

read also : ఇక వైద్య రంగానికి హబ్ గా ఖమ్మం.. 8 ఎకరాల్లో వైద్య కళాశాల ఏర్పాట్లు పూర్తి..

నర్సింగ్, ఫిషరీస్, ఇంజనీరింగ్ కళాశాలలతో ప్రాంతం అభివృద్ధి చెందుతుందని మంత్రి అభిప్రాయ పడ్డారు. కార్యక్రమంలో పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో విద్యకు సంబంధించి ఎంతో అభివృద్ధి జరిగిందని అన్నారు. ఆనాడు చదువుకునే పరిస్థితి కాక చదువు కొనే పరిస్థితి ఉండేదని, నేడు పరిస్థితి మారిందని తెలిపారు. అంగన్వాడీ నుండి ఉన్నత చదువులు అన్ని అందుబాటులోకి తెచ్చిందన్నారు. డబ్బు ఎక్కువ ఉందని, డబ్బు లేదని చదువు ఆపొద్దని ఆయన తెలిపారు.

ప్రతి పిల్లవాడు చదువుకునేలా చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. ఫిషరీస్, నర్సింగ్, ఇంజనీరింగ్ కళాశాలలతో నియోజకవర్గం విద్యారంగంలో మరింత ముందుకు వెళుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర రెడ్డి, తాతా మధుసూదన్, జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్, పోలీస్ కమీషనర్ విష్ణు ఎస్. వారియర్, జెడ్పి చైర్మన్ లింగాల కమలరాజ్, రాష్ట్ర విత్తనాభివృద్ది సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, జిల్లా వైద్య ఆరోగ్య అధికారిణి డా. మాలతి, నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ రత్న కుమారి, ఖమ్మం రూరల్ ఎంపిపి బెల్లం ఉమ, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.