Read News in Telugu Language
adsdaksha

అవయవ దాతలకు గౌరవంగా అంత్య క్రియలు .. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ సంచలన నిర్ణయం ..

దక్ష న్యూస్, హైదరాబాద్ : ఫిబ్రవరి 15

కొంత మంది రక్తదానం చెయ్యాలంటేనే భయపడతారు. ఇంట్లో ఎవరైనా చనిపోతే వారి అవయవాలు దానం చేయడానికి ముందుకు రావడం అరుదు. కొంతమంది మాత్రమే తమ ఆప్తులను మరణం తర్వాత కూడా సజీవంగా ఉంచే అవయవ దానం పట్ల మొగ్గు చూపుతారు. అయితే మృతి చెందిన వారి అవయవాలు దానం చేసి బతికి ఉన్నవారికి ప్రాణాలు పోసే వారికోసం ఒడిశా సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. రోడ్డు ప్రమాదాలు సహా మరికొన్ని ఘటనలతో బ్రెయిన్ డెడ్ అయిన, లేదా సడెన్ గా చనిపోయిన వారి అవయవాలు దానం చేసేవారిని గౌరవంగా సాగనంపాలని ఒడిశా సర్కార్ నిర్ణయించింది. ఒడిశా ( odisha ) లో అవయవ దానం చేసిన ఎవరికైనా ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలని సీఎం నవీన్ పట్నాయక్ ( Naveen Patnaik ) అధికారులను ఆదేశించారు.

Hospital

read aalso : ఉద్యోగాలు ఇచ్చే చాతకాలే.. మేం 25 వేల నౌకర్లు ఇచ్చాం: సీఎం రేవంత్ ..

అవయవ దాతల అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహిస్తామని నవీన్ పట్నాయక్ వెల్లడించారు. ఆర్గాన్ డోనార్స్‌ని ప్రోత్సహించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. గతంలో సూరజ్ అనే పేరుతో వారికి అవార్డులు ఇచ్చేవారు. 2019లో రోడ్డు ప్రమాదంలో చనిపోయిన సూరజ్ అనే బాలుడి అవయవాలు దానం (Organ Donors) చేసేందుకు తల్లిదండ్రులు సాహసం చేశారు. అయితే అలా చిన్నారి కాలేయం, గుండె, కళ్లు తదితర అవయవాలను దానం చేయడంతో మరి కొంత మందికి నూతన జీవితం ఇచ్చిన వారు అయ్యారు. కాగా ఈ విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్.. సూరజ్ పేరెంట్స్ ను కలిసి కుటుంబానికి రూ.5 లక్షల సాయం అందజేశారు. ఆ చిన్నారి స్ఫూర్తిగా సూరజ్ పేరుతో ఏటా అవార్డులు అందజేస్తున్నారు. తాజాగా అవయవాలు దానం చేసేవారిని గౌరవంగా సాగనంపాలని ఒడిశా సర్కార్ నిర్ణయం తీసుకోవడం పట్ల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.