Read News in Telugu Language
adsdaksha

పవర్ స్టార్ “OG” ప్రాజెక్ట్ దానయ్య చేజారిందా..

దక్ష న్యూస్, హైదరాబాద్ జనవరి 9

– ఆసక్తిగా మారిన సోషల్ మీడియా చర్చ..

తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దానయ్య OG సినిమాను నిర్మిస్తున్నారు.

ఈ సినిమాకు సాహో ఫేమ్ సుజిత్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ చిత్రం, ఇమ్రాన్ హష్మీ, అర్జున్ దాస్, షాన్ కక్కర్, ప్రియాంక మోహన్, శ్రీయారెడ్డి వంటి భారీ తారాగణంతో రూపొందుతున్నది.

సలార్ సినిమాతో ప్రేక్షకులకు మరింత దగ్గరైన శ్రీయా రెడ్డి ఇటీవల మాట్లాడుతూ.. ఈ మూవీ ఓ రేంజ్‌లో ఉంటుందని, ఓజీ వెండితెర పై కనివిని ఎరుగని హైప్ని చూస్తారని, ఆ సినిమా తర్వాత తాను కూడా రిటైర్ అయిపోతానని, సినిమాలోని తాను చేసిన పాత్ర చాలా గొప్ప అనుభూతి తనకి లభించదని చెప్పటం విశేషం..

Hospital

Read also: నా రోల్ మోడల్ శాం పిట్రోడా : డిప్యూటీ సీఎం భట్టి..

ఇదిలా ఉండగా, ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమా నిర్మాతగా దానయ్య ప్రాజెక్ట్ నుండి తప్పుకుంటున్నారని, వేరే ప్రతిష్టాత్మక సంస్థ కు ఈ ప్రాజెక్టు బదిలీ కానుందనే వార్త సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతుండడం తో, ఇది సోషల్ మీడియాలో భారీ చర్చకు దారి తీసింది.

ఈ సినిమా ఆలస్యం కూడా ఓ కారణం కాగా, నెటిజన్లు, సినీ వర్గాలు గత సందర్భాలను గుర్తు చేస్తూ, డీవీవీ దానయ్య, ఇటీవల ప్రభాస్, మారుతి కాంబినేషన్‌లో వస్తున్న సినిమాకు ముందుగా డీవీవీ దానయ్యనే నిర్మాత కాగా, ఆ తర్వాత ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకొని ఆ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీకి అప్పగించడం ఈ వార్తకు ప్రాధాన్యం సంతరించుకుంది.

ఈ సినిమా బ్యానర్ మార్పుకు ఇదే కారణమా.. లేదా మరేదేమైనా ఉందా.. అనేది నిర్మాత క్లారిటీ ఇస్తే గాని తెలిసేలా లేదు.

Leave A Reply

Your email address will not be published.