Read News in Telugu Language
adsdaksha

18 ఓటీటీలు బ్యాన్ .. నిషేధం విధిస్తూ కేంద్ర సమాచార మంత్రిత్వశాఖ నిర్ణయం ..

దక్ష న్యూస్, హైదరాబాద్ : మార్చి 14

18 ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ పై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ మేరకు గురువారం కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది.19 వెబ్‌సైట్లు, 10 యాప్‌లు, 57 సోషల్ మీడియా ఖాతాలను కూడా బ్లాక్ చేస్తున్నట్టు వెల్లడించింది. ఆయా ప్లాట్‌ఫామ్స్ అసభ్యకరమైన కంటెంట్‌తో పాటు కొన్ని సందర్భాల్లో పోర్నోగ్రఫీ కంటెంట్‌ను కూడా పబ్లిష్ చేస్తున్నాయని పేర్కొంది.

Hospital

read also : ఇద్దరు ఎన్నికల కమిషనర్ల నియామకం .. రాష్ట్ర పతి ఆమోదం..

ఆ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్, వెబ్‌సైట్‌లపై పోస్ట్ చేస్తున్న కంటెంట్ అసభ్యకరంగా, అశ్లీలంగా, స్త్రీలను అవమానపరిచే విధంగా ఉందని గుర్తించామని తెలిపింది. ఉపాధ్యాయులు-విద్యార్థుల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య అసభ్యకర సంబంధాలను చూపించే కంటెంట్‌ను చిత్రీకరిస్తున్నారని, బూతులు ఎక్కువగా ఉన్నాయని గుర్తించినట్టు కేంద్రం పేర్కొన్నది.

Leave A Reply

Your email address will not be published.