Read News in Telugu Language
adsdaksha

పీవీకి భారతరత్న.. చరణ్‌సింగ్‌, స్వామినాథన్‌లకు అత్యున్నత పౌర పురస్కారం ..

దక్ష న్యూస్, హైదరాబాద్ : ఫిబ్రవరి 9

– ట్విట్టర్ ద్వారా వెల్లడించిన ప్రధాని మోడీ..

తెలుగు వాడు, తెలంగాణ బిడ్డ, వరంగల్ జిల్లా వంగర వాసి పీవీ నరసింహారావు ( p.v. narasimharao ) ను భారత అత్యున్నత పురస్కారం వరించింది. మాజీ ప్రధానిగా ఎన్నో సంస్కరణలు చేసిన పీవీకి కేంద్రంలోని మోడీ ( modi ) ప్రభుత్వం భారతరత్న( bharatharatna ) ప్రకటిస్తున్నట్లు ప్రధాని మోడీ ట్విట్టర్ వేదిక వెల్లడించారు. ఆయనతో పాటు మాజీ ప్రధాని చౌదరి చరణ్‌సింగ్‌తో పాటు వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్‌లకు కూడా భారత అత్యున్నత పౌర పురస్కారం అవార్డును ప్రకటించారు.

read also : ఉద్రిక్తతంగా ఉత్తరాఖండ్ .. మసీదు, మదర్సా కూల్చివేతతో రణరంగం ..

Hospital

మాజీ ప్రధాని పీవీ నరసింహారావును భారతరత్నతో సత్కరించడం ఆనందంగా ఉందని, ప్రముఖ పండితుడు, రాజకీయవేత్త అయిన నరసింహారావు వివిధ హోదాలలో విస్తృత సేవలు అందించారని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా, పార్లమెంటు, అసెంబ్లీ సభ్యునిగా ఎన్నో ఏళ్లుగా ఆయన విశేష కృషి చేశారని ప్రధాని ట్వీట్ లో వెల్లడించారు. అంతేకాదు, భారతదేశాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేయడంలో, దేశ శ్రేయస్సు, అభివృద్ధికి బలమైన పునాది వేయడంలో ఆయన దూరదృష్టి గల నాయకత్వం కీలక పాత్ర పోషించిందని, నరసింహారావు ప్రధానిగా పనిచేసిన కాలం ఆర్థికాభివృద్ధిలో కొత్త శకానికి నాంది పలికిందని ప్రధాని మోదీ ట్వీట్ లో పేర్కొన్నారు.

read also : ఆటోలో అసెంబ్లీకి .. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వినూత్న నిరసన ..

అదేవిధంగా భారతదేశ ఐదో ప్రధానిగా పనిచేసిన దివంగత చౌదరి చరణ్ సింగ్ రైతుల సంక్షేమం కోసం చేసిన అచంచలమైన అంకితభావానికి మరణానంతరం భారతరత్నతో సత్కరించుకున్నాం అంటూ మోడీ ట్వీట్ చేశారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా, భారత హోం మంత్రిగా పని చేసిన చరణ్ సింగ్ అన్నదాతల కోసం ఎన్నో పోరాటాలు చేశారన్నారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా చేసిన ప్రతిఘటన, ప్రజాస్వామ్యం పట్ల నిబద్ధత దేశానికి స్ఫూర్తినిచ్చేవిగా నిలిచాయి. దేశానికి ఆయన చేసిన సాటిలేని సేవలను గౌరవించడం ప్రభుత్వానికి దక్కిన అదృష్టం అని ప్రధాని మోడీ వీరి సేవలను కొనియాడారు.

Leave A Reply

Your email address will not be published.