Read News in Telugu Language
adsdaksha

కాంగ్రెస్.. పాంచ్ న్యాయ్.. 5 గ్యారంటీలతో హస్తం మేనిఫెస్టో రెడీ ..

దక్ష న్యూస్, హైదరాబాద్ : మార్చి 20

వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఎక్కువ ఎంపీ సీట్లు సాధించి కేంద్రంలో అధికారంలోకి రావాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ దూకుడు ప్రదర్శిస్తోంది. ఒకవైపు అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తూనే మరోవైపు ఎన్నికల్లో ఇచ్చే హామీలపై కసరత్తులు చేస్తున్నది. ఈ మేరకు దేశంలోని అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునేలా మేనిఫెస్టో రూపకల్పన చేసింది. ‘పాంచ్ న్యాయ్’  ( paanchnyay ) పేరుతో రూపొందించిన మేనిఫెస్టోకు మంగళవారం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నిన్న ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో భేటీ అయిన సీడబ్ల్యూసీ పాంచ్ న్యాయ్ మేనిఫెస్టోపై చర్చించిన అనంతరం ఆమోదం తెలిపింది.

Hospital

read also : dsp praneeth rao : ప్రణీత్ రావు కేసులో ప్రత్యేక దర్యాప్తు .. కీలక సమాచారం సేకరించిన పోలీసులు..

అయితే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆమోదించిన తర్వాత అధికారికంగా మేనిఫెస్టోను విడుదల చేయనున్నట్టు తెలుస్తున్నది. మేనిఫేస్టోలో హిస్సేదారి న్యాయ్, కిసాన్ న్యాయ్, శ్రామిక్ న్యాయ్, యువ న్యాయ్, నారీ న్యాయ్ పేరిట కాంగ్రెస్ ఐదు ప్రధాన హామీలు ఉన్నాయి. ఒక్కో గ్యారంటీలో మరో ఐదు హామీలివ్వనున్నారు. అంటే మొత్తం 25హామీలను కాంగ్రెస్ పార్టీ ఇవ్వనున్నది.

Leave A Reply

Your email address will not be published.