Read News in Telugu Language
adsdaksha

14 న ప్రెస్ టూర్ ..

దక్ష న్యూస్, హైదరాబాద్: సెప్టెంబర్ 10

దక్షిణ తెలంగాణ వరప్రదాయని గా నిలిచే పాలమూరు-రంగారెడ్డి ( palamuru, rangareddy ) ఎత్తిపోతల పథకం ద్వారా 12.30 లక్షల ఎకరాలకు సాగునీరు, 1200 గ్రామాలకు తాగునీరు అందనున్నట్లు పబ్లిసిటీ సెల్ జాయింట్ డైరెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఏదుల పంప్ హౌజ్ వద్ద ఆసియాలోనే అతిపెద్దదైన సర్జ్ పూల్ నిర్మాణం జరిగినట్లు వెల్లడించారు. అత్యధిక సామర్థ్యం గల పంపుల వినియోగంలో కాళేశ్వరం రికార్డు ను మించి 145 మెగావాట్ల సామర్థ్యం గల మహా బాహుబలి మోటర్లను వినియోగించే ఈ పాలమూరు – రంగా రెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.

read also : మున్నేరు వరద బాధిత కుటుంబాలకు ఆర్ధిక సాయం చెక్కుల పంపిణీ..

Hospital

ఈ ప్రాజెక్టు ను పరిశీలించేందుకై ఈనెల 14 వ తేదీన గురువారం ప్రెస్ టూర్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ ప్రెస్ టూర్ కు వచ్చే మీడియా ప్రతినిధులు / పత్రికా విలేకరులు తమ పేర్లను ఈనెల 12 వతేదీ మధ్యాహ్నం 12 గంటలలోపు ఇవ్వాల్సిందింగా కోరారు. అసిస్టెంట్ డైరెక్టర్ సత్యనారాయణ రెడ్డి (సెల్ నెంబర్: 9849909083 లేదా పీఆర్ఓ అరవింద్ 7995028013 లకుమెసేజ్ ద్వారా లేదా ఫోన్ చేసి తమ వివరాలు తెలియచేయాలన్నారు.

read also : మున్నూరు కాపులు రాష్ట్ర సమగ్రాభివృద్ధికి పాటు పడాలి..

 

Leave A Reply

Your email address will not be published.