Read News in Telugu Language
adsdaksha

పల్లా జాన్ రాములు జయంతి సందర్భంగా ఉచిత వైద్య శిబిరం..

దక్ష న్యూస్, ఖమ్మం: అక్టోబర్ 12

వ్యాధుల సీజన్ లో నిరుపేదలెవరూ వైద్యానికి దూరం కారాదన్న ఆలోచనతో తన తండ్రి స్వర్గీయ పల్లా జాన్ రాములు ( palla john ramulu ) 85వ జయంతిని పురష్కరించుకుని ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు యువ నాయకుడు, సంఘ సేవకుడు పల్లా కిరణ్ కుమార్ ( palla kiran kumar ) తెలిపారు. గురువారం ఖమ్మం ( khammam ) నగరంలోని మిషన్ ఆసుపత్రి ( mission hospital ) ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఐదు రోజుల ఉచిత వైద్య శిబిరాన్ని ( health camp ) పల్లా కిరణ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తన తండ్రి ఆశయం మేరకు తన చుట్టూ ఉండే నిరుపేదలకు, విధివంచితులకు ఆపత్కాలంలో తన వంతు సేవలు అందిస్తున్నట్లు తెలిపారు.

read also : ఖమ్మంలో ఐదు రోజుల పాటూ ఉచిత వైద్య శిబిరం..

ప్రస్తుత వ్యాధుల సీజన్ లో ప్రతీ ఇంట్లో జ్వరాలు, ఇతర సీజనల్ వ్యాధులతో ప్రజలు ఇబ్బంది పడడాన్ని గమనించి తన వంతు బాద్యతగా వైద్యశిబిరాన్ని ఏర్పాటు చేశామని కిరణ్ కుమార్ అన్నారు. ఐదు రోజుల పాటూ ప్రతీ రోజు ఉదయం గం. 11 నుండి గం. 1 వరకు వైద్యులు అందుబాటులో ఉంటారని వెల్లడించారు. వైద్య పరీక్షల అనంతరం ఉచితంగా మందులు అందజేస్తున్నామని అన్నారు. ఖమ్మం వాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అవసరం ఉన్న వారు వైద్య పరీక్షలకు హాజరవ్వాలని కోరారు.

Hospital

read also : మన వైద్యుడి చెంతకు విదేశీ పేషెంట్ లు .. వైద్యరంగంలో సంచలనం ..

వైద్య శిబిరంలో జ్వరము, దగ్గు, జలుబు, బి.పి., షుగర్ ఇతరాత్ర సమస్యలు ఉన్నవారికి, చిన్నారులకు సంబంధించిన ఆరోగ్య సమస్యలకు నిపుణులైన వైద్యులచే వైద్యం అందించి మందులు అందజేశారు. సుమారు 300 మంది వైద్య శిబిరంలో పాల్గొని వైద్య సేవలు పొందారు. కార్యక్రమంలో డాక్టర్లు రఘు, చందన, సాయి సంపత్ కృష్ణ, మిషన్ హాస్పిటల్ మేనేజర్ కృష్ణకుమారి, చిలకబత్తిని కనకయ్య, స్పందన, లక్ష్మి, సుజాత, అబ్రహం, సత్యనారాయణ, గిరి, జగన్ , సురేష్ , శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

read also : మానవత్వానికే కాదు దైవత్వానికి నిలువెత్తు నిదర్శనం ఈ వైద్య నారాయణుడు..

Leave A Reply

Your email address will not be published.