Read News in Telugu Language
adsdaksha

ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన.. 3వ రోజు 450 మందికి వైద్య సేవలు..

దక్ష న్యూస్, ఖమ్మం: అక్టోబర్ 14

ప్రజా నాయకుడు పల్లా జాన్ రాములు ( palla john ramulu ) 85వ జయంతి సందర్భంగా 5 రోజుల పాటూ ఖమ్మం శాంతినగర్ ( shanthi nagar ) మిషన్ హాస్పిటల్ ప్రాంగణం లో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరంలో 3వ రోజు శనివారం స్థానిక పేషెంట్ లతో ఉచిత వైద్య శిబిరం రద్దీగా మారింది. జ్వరం, విరోచనాలు, దగ్గు, జలుబు బి.పి., షుగర్ లాంటి సమస్యలతో స్థానిక పరిసర ప్రాంత ప్రజలు దాదాపు 450 మంది వైద్య శిబిరానికి హాజరయ్యరు. పల్లా కిరణ్ కుమార్ ( palla kiran kumar )  ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వైద్య శిబిరంలో కిరణ్ కుమార్ దగ్గరుండి ఏర్పాట్లు పర్యవేక్షించారు. వైద్య పరీక్షల అనంతరం మందులను పంపిణీ చేశారు.

read also : హెచ్‌సీఏ ఎన్నిక‌ల సంగ్రామంలో జ‌గ‌న్‌మోహ‌న్ రావు ..

Hospital

వైద్య శిబిరానికి హాజరైన నిరుపేద ప్రజలు నిర్వాహకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పల్లా కిరణ్ కుమార్ మాట్లాడుతూ, తన తండ్రి చూపించిన బాటలో నడుస్తూ, నలుగురికి ఉపయోగపడడం ఎంతో సంతృప్తిని ఇస్తోందన్నారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా తన తండ్రి పల్లా జాన్ రాములు సేవలను ప్రజలు గుర్తు చేస్తుంటే అలాంటి తండ్రికి తనయుడిగా ఎంతో గర్వంగా ఉందన్నారు. ఇక ముందుకూడా తన తండ్రి ఆశయానికి అనుగుణంగా ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు తన వంతు సేవలు అందించడానికి సిద్దంగా ఉంటానన్నారు. కార్యక్రమంలో వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, పల్లా కిరణ్ మిత్ర బృందం తదితరులు పాల్గొన్నారు.

read also : అమావాస్య నిజంగా మంచిది కాదా..

 

Leave A Reply

Your email address will not be published.