Read News in Telugu Language
adsdaksha

panchangamu : పంచాంగము .. రాశీ ఫలాలు..

దక్ష న్యూస్, ఆధ్యాత్మికం.

సెప్టెంబర్ 10వ తారీకు 2023 భాను వాసరః

సూ. ఉ: 06:05 AM సూ. అ: 06:20 PM

స్వస్తి శ్రీ శోభకృత్ సంవత్సరము, దక్షిణాయణం, వర్షఋుతువు, శ్రావణ మాసం, ఆదివారం

తిథి సూర్యోదయకాల తిథి: కృష్ణ-ఏకాదశి
కృష్ణ-ఏకాదశి ఈ రోజు 09:30 PM వ. ,

తదు. కృష్ణ-ద్వాదశి నక్షత్రము పునర్వసు ఈ రోజు 05:07 PM వ. ,

తదు. పుష్యమి చంద్ర రాశి మిథున రాశి 07/09/2023, 23:13:53 నుం. 10/09/2023, 10:26:08 వ.

వర్జ్యం రేపు (11) 02:05 AM నుం. రేపు (11) 03:53 AM వ.

దుర్ముహూర్తం 04:42 PM నుం. 05:31 PM వ.

రాహుకాలం 04:48 PM నుం. 06:20 PM వ.

అమృత ఘడియలు ఈ రోజు 02:27 PM నుం. 04:14 PM వ.

రాశీ ఫలాలు..

 

మేషం:

ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో అప్రమత్తంగా వ్యవహరించాలి. దైవ కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. బంధుమిత్రులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. వ్యాపారులకు చిక్కులు తప్పవు. నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి.

 

వృషభం:

ఆస్తి వివాదాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారమున ఆశించిన లాభాలు అందుకుంటారు. చిన్ననాటి మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. విద్యార్థులకు విదేశీ ప్రయాణ ప్రయత్నాలలో కీలక సమాచారం అందుతుంది.

 

మిధునం:

ఉదర అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారులకు నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనులు ముందుకు సాగవు. గృహ వాతావరణం చికాకుగా ఉంటుంది. ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. ఉద్యోగమున తొందరపాటు నిర్ణయాలు చెయ్యడం మంచిది కాదు.

 

కర్కాటకం:

Hospital

గృహ వాతావరణం సందడిగా ఉంటుంది. వ్యాపారులకు సకాలంలో పెట్టుబడులు అందుతాయి. అవసరానికి సన్నిహితుల సాయం పొందుతారు. స్థిరస్తి విషయాలలో చికాకులు తొలగుతాయి. నూతన వాహన యోగం ఉన్నది. ఉద్యోగులకు దీర్ఘ కాలిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.

 

సింహం:

ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. బంధువులతో మాటపట్టింపులు ఉంటాయి ఆరోగ్యపరంగా వైద్య సంప్రదింపులు అవసరమవుతాయి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. వ్యాపారులకు గందరగోళ పరిస్థితులుంటాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు పెరుగుతాయి.

 

కన్య:

వృత్తి వ్యాపారాలు అనుకున్నది సాధిస్తారు. దైవచింతన పెరుగుతుంది. నూతన వ్యాపారాలు ప్రారంభించిన లాభాలు అందుకుంటారు. ఉద్యోగ యత్నాలలో విజయం సాధిస్తారు. సంఘంలో పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగులకు పని ఒత్తిడి ఉన్నపటికీ నిదానంగా పూర్తిచేస్తారు.

 

తుల:

వాహన వ్యాపారస్తులకు విశేషమైన లాభాలు అందుతాయి. స్థిరస్తి కొనుగోలు చేస్తారు. ఆలయ దర్శనం చేసుకుంటారు. సన్నిహితులతో సఖ్యతగా వ్యవహారిస్తారు. ఆర్థికంగా పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగులకు అధికారుల అండదండలతో నూతన అవకాశములు లభిస్తాయి.

 

వృశ్చికం:

ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి. కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారమున స్వల్ప లాభాలు అందుతాయి. బంధు మిత్రులతో మీ మాటతో విబేదిస్తారు. ఉద్యోగం వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ఆర్థిక వాతావరణం చికాకుగా ఉంటుంది.

 

ధనస్సు:

దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. సోదరులతో స్థిరస్తి వివాదాలు కలుగుతాయి. అవరానికి చేతిలో డబ్బు నిలువ ఉండదు. ఉద్యోగులకు సహోద్యోగులతో మాటపట్టింపులు కలుగుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

 

మకరం:

విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. చేపట్టిన పనుల్లో యత్నకార్యసిద్ధి కలుగుతుంది. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగం యోగం ఉన్నది.

 

కుంభం:

మిత్రుల నుంచి శుభవర్తమానాలు అందుతాయి. భూ వివాదాలు పరిష్కారమౌతాయి. వృత్తి వ్యాపారములు ఉత్సాహంగా సాగుతారు. ఆర్థిక అనుకూలత కలుగుతుంది. నిరుద్యోగుల ఊహలు నిజమవుతాయి. ఉద్యోగులకు ప్రతిభకు మంచి గుర్తింపు లభిస్తుంది. విద్యార్థుల కష్టం ఫలిస్తుంది.

 

మీనం:

వృధా ఖర్చులు పెరుగుతాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. బంధువులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. అనారోగ్య విషయంలో స్వల్ప ఇబ్బందులుంటాయి. ప్రయాణాల్లో ఆకస్మిక మార్పులు. వ్యాపారులకు నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. ఉద్యోగమున పరిస్థితులు అంతగా అనుకుంలించవు.

AVB సుబ్బారావు, 9985255805

 

read also : నిత్యపూజకు మట్టి ప్రమిదలు వాడరాదు.. దక్షిణ దిశ దీపంతో అరిష్టాలు..

Leave A Reply

Your email address will not be published.