Read News in Telugu Language
adsdaksha

panchangamu : పంచాంగము.. ఈ రోజు రాశీ ఫలాలు

దక్ష న్యూస్, ఆధ్యాత్మికము

ఆగస్టు 25వ తారీకు 2023 భృగు వాసరః

సూ. ఉ.: 06:03 AM సూ. అ.: 06:33 PM

స్వస్తి శ్రీ శోభకృత్ సంవత్సరము, దక్షిణాయణం, వర్షఋుతువు, శ్రావణ మాసం, శుక్రవారం

తిథి సూర్యోదయకాల తిథి: శుక్ల-నవమి
శుక్ల-నవమి రేపు (26) 02:03 AM వ.

తదు. శుక్ల-దశమి నక్షత్రము అనురాధ ఈ రోజు 09:15 AM వ. ,

తదు. జ్యేష్ట చంద్ర రాశి వృశ్చిక రాశి 24/08/2023, 02:55:20 నుం. 26/08/2023, 08:38:47 వ.

వర్జ్యం ఈ రోజు 02:42 PM నుం. 04:16 PM వ.

దుర్ముహూర్తం 08:33 AM నుం. 09:23 AM మరియు 12:43 PM నుం. 01:33 PM వ.

రాహుకాలం
10:44 AM నుం. 12:18 PM వ.

అమృత ఘడియలు లేవు

యోగము వైధృతి ఈ రోజు 06:50 PM వ. ,

తదు. విష్కంభ కరణము బవ ఈ రోజు 03:12 AM వ. ,

తదు. బాలవ ఈ రోజు 02:43 PM వ.

నక్షత్ర పాదము అనురాధ-3 ఈ రోజు 03:17 AM వ.

అనురాధ-4 ఈ రోజు 09:15 AM వ.

జ్యేష్ట-1 ఈ రోజు 03:10 PM వ.

జ్యేష్ట-2 ఈ రోజు 09:02 PM వ.

సూర్య రాశి సింహ రాశి 17/08/2023, 13:36:41 నుం. 17/09/2023, 13:32:28 వ.

అశుభ సమయములు గుళికాకాలం 07:37 AM నుం. 09:10 AM వ.

యమగండకాలం 03:25 PM నుం. 04:59 PM వ.

రాశి ఫలితాలు ..

 

మేషం:

సన్నిహితులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. చేపట్టిన పనులలో శ్రమాధిక్యత పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ఆదాయం అంతంత మాత్రమే ఉంటుంది. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో చికాకులు అధికమవుతాయి.

Hospital

వృషభం:

చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. ఇంటాబయట ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆప్తుల నుండి విలువైన సమాచారం అందుతుంది. నిరుద్యోగులకు అధికారుల అండదండలు లభిస్తాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో అంచనాలు అందుకుంటారు.

మిధునం:

వృత్తి వ్యాపారాలలో సొంత ఆలోచనలు అమలు చేస్తారు. శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. నూతన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. గృహమునకు ఒక సంఘటన ఆకట్టుకుంటుంది. ఉద్యోగాలలో సమస్యలు తొలగి హోదాలు పెరుగుతాయి.

కర్కాటకం:

ముఖ్యమైన పనులలో ఆటంకాలు తప్పవు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. అవసరానికి చేతిలో డబ్బులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి. ఉద్యోగాలలో స్థానచలన సూచనలు ఉన్నవి. వ్యాపారాలలో నిరుత్సాహ వాతావరణం తప్పదు.

సింహం:

స్నేహితులు మీ మాటతో విబేదిస్తారు. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. ప్రయాణాలు వాయిదా పడతాయి. దూర ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టి సారించడం మంచిది. ఉద్యోగాలలో అధికారులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.

కన్య:

ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. ఇంటా బయట కొన్ని సమస్యలు సన్నిహితుల సాయంతో పరిష్కరించుకుంటారు. వ్యాపారాలలో అనుకున్న లాభాలు అందుకుంటారు. చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేయగలుగుతారు. సన్నిహితులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ఉద్యోగాల్లో పురోగతి సాధిస్తారు.

తుల:

ఆదాయం మరింత నిరాశ కలిగిస్తుంది. చేపట్టిన వ్యవహారాల్లో చికాకులు తప్పవు. కొందరి ప్రవర్తన వలన శిరో బాధలు తప్పవు. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ఉద్యోగాలలో అదనపు పని భారం వలన తగిన విశ్రాంతి ఉండదు.

వృశ్చికం:

ఆదాయ మార్గాలు పెరుగుతాయి. సన్నిహితులతో గృహమున ఆనందంగా గడుపుతారు. వ్యాపారాలలో నూతన పెట్టుబడుల విషయంలో శుభవార్తలు అందుతాయి. చాలాకాలంగా పూర్తి కాని పనులను పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.

ధనస్సు:

మిత్రులతో కొన్ని విషయాలలో మాటపట్టింపులు తప్పవు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందక ఇబ్బంది కలుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలలో అవాంతరాలు కలుగుతాయి. వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. ఉద్యోగ యత్నాలు మందకొడిగా సాగుతాయి.

మకరం:

ధార్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ఇంతకాలం పడిన కష్టానికి తగ్గ ఫలితం దక్కుతుంది. ఉద్యోగస్తులకు జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి.

కుంభం:

సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సోదరులతో స్థిరాస్తి విషయాలలో నూతన ఒప్పందం చేసుకుంటారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. సంతాన ఉద్యోగ, వివాహయత్నాలు సానుకూల ఫలితాలనిస్తాయి. వృత్తి వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది.

మీనం:

సన్నిహితులతో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. ముఖ్యమైన వ్యవహారాలలో పునరాలోచన చేయడం మంచిది. వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఇంటా బయట పరిస్థితులు అనుకూలించవు. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. ఉద్యోగాలలో సహోద్యోగులతో వివాదాలు తప్పవు.

AVB సుబ్బారావు, 9985255805

Leave A Reply

Your email address will not be published.