Read News in Telugu Language
adsdaksha

కాంగ్రెస్ తోనే ముస్లిం మైనార్టీలు.. బిఆర్ఎస్ పట్ల సడలిన విశ్వాసం ..

దక్ష న్యూస్, ఖమ్మం: మే 9

ఎస్సీ ,ఎస్టీ , మైనార్టీ , ఓబీసీల ఓట్ల ఏకీకరణ….
బిజెపి కి శరాఘాతం ..
___ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ : యం డి. షఫీ యు జమ.

గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తెలంగాణలోని ముస్లిం మైనార్టీ వర్గం ఏకపక్షంగా కాంగ్రెస్ కు మద్దతు పలికిన తీరు లోనే …. ప్రస్తుత లోక్ సభ ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పక్షాన్నే ముస్లిం మైనార్టీలు ఉన్నారు. బిజెపికి బీ టీం గా ముద్ర వేసుకున్న బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి చెందినా ఆ పార్టీ వైఖరి , పార్టీ నాయకుల తీరు తెన్నులు ఏ మాత్రం మారలేదని మెజార్టీ ముస్లిం మైనార్టీలు విశ్వసిస్తున్నారు. భారత రాజ్యాంగాన్ని మారుస్తామని , ముస్లిం మైనార్టీల రిజర్వేషన్లు రద్దు చేస్తామని స్వయంగా ప్రధాని చేస్తున్న వాఖ్యలు, తెలంగాణలో హిందూ ఓట్ల ఏకీకరణ కు బదులు ఎస్సీ ,ఎస్టీ ,ముస్లిం మైనార్టీ , ఓబీసీల ఓట్లను మాత్రం ఏకీకరణ చేస్తోంది.

కేంద్రంలోని మతోన్మాద బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపాలంటే అది కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యమని అందుకే కాంగ్రెస్ పార్టీకే మద్దతు ఇవ్వాలని ముస్లిం మైనార్టీ లతో పాటూ ఎస్సీ, ఎస్టీ , ఓబీసీలు ఒక నిర్ణయానికి వచ్చారు. రాజ్యాంగాన్ని మార్చి వేసేందుకే ఈసారి 400 సీటు కావాలని బిజెపి కోరుకుంటుందని , విస్తృత ప్రచారం దేశవ్యాప్తంగా జరిగిన నేపథ్యంలో , బిజెపి కోరుకుంటున్న విధంగా తమ ఓటు బ్యాంకు స్థిరీకరణ జరుగక , లబ్ధి పొందలేక పోతోంది. గత పది ఏళ్ల కాలంగా దేశంలో ఎక్కడ ఎటువంటి అభివృద్ధి జరగలేదని పైగా నిరుద్యోగం , అసమానతలు , పేదరికం పెరిగిపోతూ ప్రజల జీవన పరిస్థితులను అతలాకుతలం చేస్తున్నప్పటికీ కార్పోరేట్లకే కేంద్ర ప్రభుత్వం అండ గా నిలుస్తున్న వైఖరి కారణంగా ఆ పార్టీ ఓటు బ్యాంకు కూడా దూరం అవు తోందని ఇటీవల విడతలా వారీగా జరుగుతున్న ఎన్నికల సందర్భంగా రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

Read also: ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ చేస్తాం.. రైతులు అధైర్య పడొద్దు : ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ..

ఉన్న ప్రభుత్వరంగ సంస్థలను అమ్మడం లేదా ప్రైవేటీకరించడం , ఈ డి, సిబిఐ , ఇన్కమ్ టాక్స్ , ఎన్నికల సంఘం వంటి స్వతంత్ర ప్రభుత్వ రంగ సంస్థలను దుర్వినియోగ పరుస్తున్న తీరు , న్యాయ వ్యవస్థ ను ప్రభావితం చేస్తుందన్న అరోపణలు , విమర్శలు మిన్నంటుతున్నాయి.

Hospital

మరోసారి కేంద్రంలో బిజెపి అధికారం చేపడితే రాజ్యాంగాన్ని మారుస్తాం అని కొందరు బిజెపి నాయకుల మాటల దుమారం , పదేళ్ల కాల పాలన పై వచ్చే సహజ సిద్ధ వ్యతిరేకత కలగలిపి , ఉత్తరాది రాష్ట్రాలలో సైతం భారతీయ జనతా పార్టీ తీవ్రంగా దెబ్బతినే సూచనలు కనిపిస్తున్నాయని ఇటీవల జరిగిన మూడు దఫాల పోలింగ్ స్పష్టం చేసిందని పలువురు రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఇలా జరుగుతుందని ఇతర రాష్ట్రాలలో జరిగే డ్యామేజీని దక్షిణాది రాష్ట్రాల ద్వారా పూడ్చుకోవాలని భావించిన బిజెపి అందుకు తగ్గట్టుగా వ్యూహ రచన చేసినప్పటికీ సంస్థాగత బలం లేకపోవడం కారణంగా పుంజు కోలేక పోతోంది .అహంకారం , ఒంటెద్దు పోకడలు, అవినీతి , అక్రమాలు , భూ కబ్జాలు, పార్టీ నాయకులు , ప్రజా ప్రతినిధుల వైఖరి…. దశాబ్ద కాలంగా తెలంగాణలో పరిపాలించిన నిన్నటి టిఆర్ఎస్ నేటి బి ఆర్ ఎస్ నూ గత అసెంబ్లీ ఎన్నికలలో పాతాళానికి తొక్కి పడేసినప్పటికీ …. బీ ఆర్ ఎస్ లో ఇంకా మార్పు రాలేదని తెలంగాణలో అత్యధికులు భావిస్తున్నారు. ప్రస్తుత పార్లమెంటు ఎన్నికలలో బీఆర్ఎస్ కు ఓటు వేస్తే ఎలాంటి ఫలితం ఉండదని అదే కాంగ్రెస్కు ఓటు వేస్తే కేంద్రంలో ప్రభుత్వ మారుతుందని అభిప్రాయపడుతున్న ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనార్టీ , ఓబీసీ వర్గాలు గత అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే ఈసారి కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలకాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

Read also: బీజేపీ, బీఆర్ఎస్ రాష్ట్రానికి చేసిందేమీ లేదు : బోనకల్ రోడ్ షోలో మంత్రి పొంగులేటి ..

సుదూర భవిష్యత్ లో బిఆర్ఎస్ పరిస్థితి ఆశా జనకంగా కనిపించక పోయేసరికి.. బీఆర్ఎస్ నుంచి వలసలు సాగటం, వరంగల్ యం పీ గా టికెట్ కేటాయించినా కడియం కావ్య.. బిఆర్ఎస్ కు రాజీనామా చేసి, కాంగ్రెస్ లో చేరడం బిఆర్ఎస్ దుస్థితి కి అద్దం పడుతోంది. కాగా , కాంగ్రెస్ తెలంగాణలో పాలనా పగ్గాలు చేపట్టి , అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు , ప్రజా పాలన విధానానికి ఆమోదం పలుకుతున్న ప్రజలు కేంద్రంలో కూడా ఇదే విధానాలు అమలు కావాలని కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఓటు వేయాలని సంసిద్ద మౌతున్నారు. ఈ క్రమంలోనే జమాతే ఇస్లామీ హింద్ ( జే ఐ హెచ్ ), జమియత్ ఉలేమా ఏ హింద్ ( జే యూ హెచ్ ) ల అన్ని జిల్లా కమిటీలు తెలంగాణ వ్యాప్తంగా సమావేశాలు తలపెట్టి , బిజెపి కి వ్యతిరేకంగా కాంగ్రెస్ కి అనుకూలంగా ఓటు వేయాలని పిలుపునిస్తున్నాయి. కాగా దక్షిణాది రాష్ట్రాలలో తమ వాఖ్యలు , తమ విధానాల ఫలితంగా తమ పార్టీకి అదనంగా కొన్ని సీట్లు వస్తాయని భావిస్తున్న భారతీయ జనతా పార్టీకి …. భస్మాసుర హస్తం వలె, తమ వ్యాఖ్యలు , తమ విధానాలే శరాఘాతం గా మారుతున్న వైనాన్ని , భూమరాంగ్ గా మారుతున్న పరిస్థితులను ఆ పార్టీ నాయకులు గమనించనప్పటికీ పరిశీలకులు అంచనా వేస్తూ, గతం కన్నా ఈసారి తెలంగాణలో బిజెపికి తక్కువ సీట్లే వస్తాయని పేర్కొంటున్నారు.

 

యం డి. షఫీ యు జమ.

Leave A Reply

Your email address will not be published.