Read News in Telugu Language
adsdaksha

సమాచార మంత్రికి టీడబ్ల్యూజేఎఫ్ నేతల అభినందనలు ..

- జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి

రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రిగా డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి ( patnam mahender reddy ) బుధవారం పదవీ బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంగా పలువురు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ( twjf ) రాష్ట్ర నాయకులు ఆయనకు అభినందనలు తెలియజేశారు. ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి. బసవపున్నయ్య, కార్యదర్శి ఎస్ కే సలీమా, నాయకులు కె. పాండురంగారావు, జే. ఉదయ్ భాస్కర్ రెడ్డి తదితరులు మంత్రి మహేందర్ రెడ్డిని కలిసి బొకే అందజేసి అభినందనలు తెలిపారు.

Hospital

read also : సెప్టెంబర్ 1 న స్వతంత్ర భారత వజ్రోత్సవ ముగింపు వేడుకలు .. హాజరవనున్న సి.ఎం కేసీఆర్ ..

ఈ సందర్భంగా రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను వారు మంత్రికి వివరిస్తూ సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ప్రధానంగా జర్నలిస్టులకు ఇళ్ళస్థలాలు, హెల్త్ కార్డులు, అక్రెడిటేషన్ కార్డులు, రైల్వే రాయితీ పాస్ లు, పెన్షన్ స్కీమ్ తదితర 12 దీర్ఘకాలిక డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సమస్యలపై అధ్యయనం చేసి పరిష్కరించాలని వారు మంత్రిని కోరారు.

Leave A Reply

Your email address will not be published.