Read News in Telugu Language
adsdaksha

pawan kalyan : ఇదే నా ఇజం.. హ్యూమనిజం : పవన్ కళ్యాణ్

దక్ష న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం: నవంబర్ 23

అన్నిరంగాల్లో వెనుకబడిన తెలంగాణలో ధర్మయుద్ధం చేద్దాం..

నల్లగొండ జిల్లానే జనసేన పార్టీ ఆవిర్భావానికి స్ఫూర్తి..

తెలంగాణ యువత పోరాట స్ఫూర్తితోనే ఆంధ్రాలో పోరాటం ..

అన్నిరంగాల్లో వెనుకబడిన తెలంగాణ ( telangana ) లో ధర్మయుద్ధం చేద్దామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ( pawan kalyan ) పిలుపునిచ్చారు. గురువారం సూర్యాపేట, కొత్తగూడెం, మెదక్ జిల్లా చేగుంటలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్తగూడెం ( kottagudem ) లో పవన్ మాట్లాడుతూ, తెలంగాణలో బీజేపీ ( bjp ) నేతృత్వంలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. తన చేతిలోని ఎరుపు కండువాను చూపించి ఇది విప్లవానికి గుర్తు అని, కాషాయం జెండా సనాతన ధర్మానికి గుర్తు అని వ్యాఖ్యానించారు.

మోడీ నాయకత్వంలో ఈ రెండు రంగులు కలిసి ముందుకు సాగుతున్నాయని, కుల, మతాలకు అతీతంగా సబ్ కా సాథ్, సబ్ కా వికాస్‌తో నినాదంతో కేంద్రం ముందుకు సాగుతోందన్నారు. నిధులు, నియామకాలు, నీళ్ల కోసం తెలంగాణ ఉద్యమం జరిగిందని గుర్తు చేశారు. జనసేన రాజకీయ పార్టీ ఆవిర్భావానికి నల్గొండ కారణమైందన్నారు. నిధులు, నియామకాలు, నీళ్లపై తెలంగాణ ఉద్యమం జరిగితే ఫ్లోరోసిస్ సమస్యతో ఇబ్బంది పడ్డ నల్లగొండ జిల్లానే జనసేన పార్టీ ఆవిర్భావానికి స్ఫూర్తి అన్నారు. తెలంగాణలో బీసీలు రాజ్యాధికారం దిశగా ప్రయత్నం చేయాలని, మోదీ నాయకత్వంలో దేశంలో అందరికీ సమాన అవకాశాలు వస్తాయన్నారు.

Hospital

read also : దొరని గడీలోనే బంధించి రాజకీయ సమాధి చేయాలి…

జనసేన మనస్ఫూర్తిగా బీజేపీకి మద్దతిస్తుందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. మరోవైపు తెలంగాణలో ఆడపడుచులు ఎక్కువగా ఆదృశ్యం అవుతున్నారని, మహిళలపై ఆగడాలు ఎక్కువయ్యాయన్నారు. తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని, ఆ దిశగా జనసేన కృషి చేస్తోందన్నారు. తెలంగాణ యువత పోరాట స్ఫూర్తితో ఆంధ్రాలో పోరాటం చేస్తున్నానని, జన్మనిచ్చిన తెలంగాణకు సేవ చేయాలనే వచ్చానన్నారు.

జిల్లాలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో నిలిచిన బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమ పోరాట స్ఫూర్తితోనే ఏపీలో రౌడీలు, గూండాలను ఎదుర్కొంటున్నానని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. కొత్తగూడెం జనసేన అభ్యర్థి సురేంద్రరావు ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.

read also : పొంగులేటి కి మద్దతుగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరమ్ మీడియా సమావేశం..

ఇదే నా ఇజం.. హ్యూమనిజం అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. తెలంగాణ కోటి రతనాల వీణ’ అని చెప్పిన దాశరథి కృష్ణమాచార్యులనే తాను స్ఫూర్తిగా తీసుకున్నట్లు చెప్పారు. తెలంగాణలో బీజేపీతో కలిసి ఎన్నికల బరిలో నిలిచినట్లు గుర్తు చేశారు. కొత్త రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే జనసేన మద్దతుతో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కావాల్సిన అవసరముందని చెప్పారు. అనంతరం చేగుంటలో బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావుకు మద్దతుగా పవన్ ప్రచారంలో పాల్గొన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.