Read News in Telugu Language
adsdaksha

పీఠాపురం బరిలో పవన్  కళ్యాణ్ .. 34 మందితో టీడీపీ రెండో జాబితా..

దక్ష న్యూస్, కాకినాడ : మార్చి 14

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ పోటీ చేసే స్థానంపై ఉత్కంఠ వీడింది. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్టు  పవన్‌ స్వయంగా వెల్లడించారు. తనకు ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఉందని,  ప్రస్తుతానికి ఎంపీగా పోటీ చేసే ఆలోచన లేదని స్పష్టం చేశారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల కోసం టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి కట్టిన సంగతి తెలిసిందే. పొత్తులో భాగంగా జనసేనకు 21 అసెంబ్లీ, రెండు లోక్‌సభ స్థానాలు కేటాయించిన విషయం తెలిసిందే.

read also : త్వరలో టెట్ ఎగ్జామ్ .. డీఎస్సీకి ముందే టీచర్ ఎలిజిబిలిటి టెస్ట్..

Hospital

మరోవైపు తెలుగుదేశం పార్టీ రెండో జాబితాను విడుదల చేసింది. 34 మందితో కూడిన సెకండ్ లిస్ట్ ను రిలీజ్ చేసింది. ఇప్పటికే 94 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను టీడీపీ విడుదల చేసింది. మరో మంది 16 మంది అభ్యర్థులను ప్రకటిస్తే.. ఆ పార్టీ కోటా పూర్తయినట్లు అవుతుంది. పొత్తులో భాగంగా టీడీపీ మొత్తం 144 అసెంబ్లీ స్థానాలు దక్కిన సంగతి విదితమే.

read also : 18 ఓటీటీలు బ్యాన్ .. నిషేధం విధిస్తూ కేంద్ర సమాచార మంత్రిత్వశాఖ నిర్ణయం ..

Leave A Reply

Your email address will not be published.