Read News in Telugu Language
adsdaksha

నాలుగో విడత వారాహి యాత్ర త్వరలో ప్రారంభం..

దక్ష న్యూస్, తిరుపతి: సెప్టెంబర్ 24

ఏపీలో టిడిపితో పొత్తుతో జనసేన పోటీ..నాగబాబు

అవినీతి పరులకు తమ పార్టీ టికెట్ ఇవ్వబోదని వ్యాఖ్య..

Hospital

కోట్ల రూపాయల ఆస్తులున్న నేతలు తమ పార్టీకి అవసరం లేదని జనసేన ( janasena ) అధినేత పవన్ కళ్ళాణ్  ( pawan kalyan ) సోదరుడు నాగబాబు ( nagababu ) అన్నారు. ప్రజలకు సేవలు అందించే వారే జనసేనకు ప్రధానమని పేర్కొన్నారు. ఆదివారం తిరుపతి ( thirupathi ) లో నాగబాబు మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తెలుగుదేశం ( telugudesam) పార్టీ అధినేత చంద్రబాబు నాయుడి ( chandrababu nayudu ) అరెస్టు అక్రమమన్నారు. పవన్ కల్యాణ్ వారాహి ( varahi ) విజయ యాత్రలో తొలి మూడు దశలు దిగ్విజయంగా ముగిశాయని తెలిపారు. వైసీపీ ( ycp ) ప్రభుత్వ తీరును పవన్ ఎండగట్టారని చెప్పారు. నాలుగో విడత వారాహి యాత్రను పవన్ కల్యాణ్ కృష్ణా జిల్లాలో త్వరలోనే ప్రారంభిస్తారని తెలిపారు.

తమ పార్టీ అవినీతి పరులకు టికెట్ ఇవ్వదని నాగబాబు స్పష్టం చేశారు. ఏపీలో టీడీపీతో పొత్తుతో పోటీ చేస్తామని తెలిపారు. పవన్ ఆలోచనల్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని తమ కార్యకర్తలకు నాగబాబు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం కొందరిపై అన్యాయంగా కేసులు పెట్టిస్తోందని అన్నారు. తాము కేసులకు భయపడబోమని చెప్పారు.

ఆంధ్రప్రదేశ్‌ లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ నుంచి ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న విషయాన్ని పార్టీ అధినేత పవన్ కల్యాణ్ (pawan kalyan) త్వరలో ప్రకటిస్తారని ఆ పార్టీ నేత నాగబాబు పేర్కొన్నారు.

 

 

Leave A Reply

Your email address will not be published.