Read News in Telugu Language
adsdaksha

సీఎంపిఎఫ్ సమస్యల పరిష్కారానికి సింగరేణి కృషి..

మణుగూరు, సెప్టెంబర్ 15, దక్ష న్యూస్:

పదవీ విరమణ చేసి ప్రతి నెల పెన్షన్ కోసం ఎదురుచూసే లబ్ధిదారులకు సౌకర్యవంతమైన సేవలు అందించడమే సింగరేణి భవిష్య నిధి ( singareni bhavishyanidhi ) కార్యాలయ సిబ్బంది లక్ష్యం కావాలని ఏరియా జనరల్ మేనేజర్ దుర్గం రామచందర్ ( durgam ramachandar ) అన్నారు. శుక్రవారం కొత్తగూడెం ( kottagudem )  ఏరియా సింగరేణి యాజమాన్యం సహకారంతో సి ఎం పి ఎఫ్ ( cm pf )  కొత్తగూడెం ఆధ్వర్యంలో పివి కాలనీ కమ్యూనిటీ హాల్లో పెన్షన్ అదాలత్ (pension adalat ) కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏరియా జనరల్ మేనేజర్  రామచందర్ మాట్లాడుతూ, పదవీ విరమణ చేసిన విశ్రాంత ఉద్యోగులకు బాసటగా నిలిచేది పెన్షన్ అన్నారు.

read also : టెట్ పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ ..

వయసు ప్రభావం కావచ్చు, పెన్షన్ పై సరైన అవగాహన లేని కారణం కావచ్చు లేదా దూర ప్రాంతాలలో నివాసముంటున్న పెన్షన్ దారులకు సకాలంలో సమాచారం తెలియకపోవచ్చు. ఈ పై కారణాల వల్ల నిబంధనల ప్రకారం సమయానికి కొన్ని ధ్రువీకరణ పత్రాలు అందించలేని విశ్రాంత ఉద్యోగులకు ఇబ్బంది కలుగకుండా మానవతా దృక్పథంతో కూడా వ్యవహరించాలని సిఎంపిఎఫ్ బాధ్యులకు సభాముఖంగా సూచించారు.

Hospital

అలాగే మారుతున్న సాంకేతిక పరిజ్ఞానం నేపథ్యంలో లబ్ధిదారుల పెన్షన్ వివరాలు ఆన్లైన్లో పొందుపర్చాలని, పెన్షన్ దారులకు మెరుగైన సేవలు అందించే విషయంలో పి.ఎఫ్ కార్యాలయానికి అన్ని విధాల తోడ్పాటు అందిస్తామని జనరల్ మేనేజర్ తెలియజేశారు. అనంతరం కొత్తగూడెం సిఎంపిఎఫ్ కార్యాలయ సహాయ కమిషనర్ ఎం కనకమ్మ మాట్లాడుతూ జిఎం సూచనల పట్ల సానుకూలంగా స్పందిస్తూ సిఎంపిఎఫ్ లబ్దిదారుల సమస్యల పరిష్కారానికి ఎప్పటికప్పుడు తగు
చర్యలు చేపడతామని సభలో హామీ ఇచ్చారు.

read also : సింగరేణి కాంటాక్ట్ కార్మికుల సీఎంపిఎఫ్ పాస్ బుక్ లు అందజేయాలి..

పెన్షన్ దారులకు ఏ ఇబ్బంది వచ్చినా తమకు చరవాణి ద్వారా సంప్రదించాలని తమ చరవాణి నెంబర్ ను లబ్ధిదారులకు కనకమ్మ అందజేశారు. పెన్షన్ దారులు వారి కుటుంబ సభ్యుల బాధ్యతలను ఆమె ఈ సందర్భంగా పెన్షన్ అదాలత్ లో అవగాహన కల్పించారు. ఈ అదాలత్ లో ఒక మహిళకు విడో పెన్షన్ మంజూరు కాపీ ని జనరల్ మేనేజర్ దుర్గం రామచందర్, సిఎంపిఎఫ్ కార్యాలయ సహాయ కమిషనర్ ఎం. కనకమ్మ చేతుల మీదుగా అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఏరియా ఎస్ ఓ టు జి ఎం వీసం కృష్ణయ్య, డిజిఎం(పర్సనల్) & ఏరియా అధికార ప్రతినిధి ఎస్ రమేష్ , సీనియర్ పర్సనల్ అధికారి సింగు శ్రీనివాస రావు గారు, శ్రీ ఎండి మదార్ సాహెబ్,  సంక్షేమ అధికారి డి నరేష్, టిబిజికేఎస్ యూనియన్ నాయకులు వి ప్రభాకర్ రావు, ఏఐటీయూసీ యూనియన్ నాయకులు సుభాని , ఐఎన్టీయూసి యూనియన్ నాయకులు జాన్, సీఐటీయూ యూనియన్ నాయకులు ప్రసాద్, హెచ్ఎంఎస్ యూనియన్ నాయకురాలు కోడిపల్లి శ్రీలత, బిఎంఎస్ యూనియన్ నాయకులు భూక్య కిషన్, సీఎం పిఎఫ్ కార్యాలయ సిబ్బంది సీతారాం, మురళీకృష్ణ, నరహరి, మధు, సింగరేణి మాజీ కార్మికులు, అస్సిస్టెంట్ స్పోర్ట్స్ సుపర్వైజర్ జాన్ వెస్లీ తదితరులుపాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.