Read News in Telugu Language
adsdaksha

ప్ర‌జాభ‌వ‌న్‌లో పాద‌యాత్ర సంబురాలు.. పీపుల్స్ మార్ఛ్ పాద‌యాత్ర‌కు ఏడాది పూర్తి ..

దక్ష న్యూస్, హైదరాబాద్ : మార్చి 16

– పార్టీ శ్రేణుల‌తో క‌లిసి కేక్ క‌ట్ చేసిన డిప్యూటి సీఎం భట్టి విక్ర‌మార్క‌..

– రాష్ట్ర వ్యాప్తంగా త‌ర‌లివ‌చ్చిన పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు..

– ప్ర‌జాభ‌వ‌న్‌లో డిప్యూటి సీఎం భ‌ట్టికి వెల్లు వెత్తిన అభినంద‌న‌లు..

– ఓయూ నుంచి త‌ర‌లొచ్చిన విద్యార్థి జేఏసీ నాయ‌కులు..

కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధి చేప‌ట్టిన హాత్ సే హాత్ జోడో యాత్ర స్పూర్తితో తెలంగాణ ( telangana ) లో ఇందిర‌మ్మ రాజ్యం తీసుకురావ‌డానికి నాటి సీఎల్పీ (clp ) నాయ‌కులు మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క ( bhatti vikramarka ) చేప‌ట్టిన పీపుల్స్ మార్చ్ పాద‌యాత్ర‌ ( people’s march padayatra ) కు స‌రిగ్గా ఏడాది పూర్తి కావ‌డంతో శ‌నివారం హైద‌రాబాద్‌ ( hyderabad ) లోని మ‌హాత్మ జ్యోతిరావు పూలే ప్ర‌జాభ‌వ‌న్‌ ( prajabhavan ) లో పాద‌యాత్ర యాదిలో ఏడాది సంబురాలు ఘ‌నంగా జ‌రిగాయి. నాటి పాద‌యాత్రికుడు, డిప్యూటి సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌ను క‌లువ‌డానికి రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ( congress ) పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పెద్ద ఎత్తున ప్ర‌జాభ‌వ‌న్‌కు త‌ర‌లిరావ‌డంతో పండుగ వాతావ‌ర‌ణం నెల‌కొంది. జై కాంగ్రెస్‌, జై రాహుల్‌, జై భ‌ట్టి అంటూ చేసిన కార్య‌క‌ర్త‌ల నినాదాల‌తో ప్ర‌జాభ‌వ‌న్ హోరెత్తిపోయింది.

Hospital

read also : ఎలక్షన్ షెడ్యూల్ వచ్చేసింది.. 7 విడతల్లో లోక్ సభ సహా 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు..

ఆదిలాబాద్ నుంచి ఖ‌మ్మం వ‌ర‌కు సాగిన పాద‌యాత్ర విష‌యాల‌ను, విశేషాల‌ను ఈసంద‌ర్భంగా నెమ‌రేసుకున్నారు. డిప్యూటి సీఎం భట్టి విక్ర‌మార్క కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల‌తో క‌లిసి కేక్ క‌ట్ చేసి అంద‌రికి ధ‌న్య‌వాదాలు తెలిపారు. కాగా పార్టీ శ్రేణులు భ‌ట్టి విక్ర‌మార్క‌కు పూల మాల‌లు వేసి, శాలువాలు క‌ప్పి, పుష్ప‌గుచ్చాలు అంద‌జేసి అభినంద‌న‌ల‌తో ముంచెత్తారు. వైరా శాస‌న స‌భ్యులు మాలోతు రాందాసు నాయ‌క్‌, మాజీ ఎమ్మెల్యే కె ఎల్ ఆర్‌, స్థానికి సంస్థ‌ల ఎమ్మెల్సీ అభ్య‌ర్థి రాయ‌ల నాగేశ్వ‌ర్‌రావు, ఓయూ జేఏసీ చైర్మెన్‌, టిపిసిసి అధికార ప్ర‌తినిధి డా. లోకేష్ యాద‌వ్‌, పిసిసి నాయ‌కులు నాయుడు స‌త్య‌నార‌య‌ణ‌, ఖ‌మ్మం కాంగ్రెస్ మ‌హిళ జిల్లా అధ్య‌క్షురాలు దొబ్బ‌ల సౌజ‌న్య త‌దిత‌రులు ఈ సంబురాల్లో పాల్గొన్నారు.

read also : ప్రతీ గడపకు లబ్ది గ్యారెంటీ.. ఇందిరమ్మ రాజ్యంతోనే అభివృద్ధి సాధ్యం..

కాగా ఆనాడు పాద‌యాత్ర‌లో పాల్గొన్న ఓయూ విద్యార్ధి నాయ‌కులు ఓయూ జేఏసీ చైర్మెన్ లోకేష్ యాద‌వ్ ఆధ్వ‌ర్యంలో పెద్ద ఎత్తున త‌ర‌లివచ్చి భట్టి విక్ర‌మార్క‌తో కేక్ క‌ట్ చేయించి స‌త్క‌రించారు.

Leave A Reply

Your email address will not be published.