Read News in Telugu Language
adsdaksha

పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు.. లీటర్ పెట్రోల్ పై రూ.2, డీజిల్ పై రూ.2 తగ్గింపు

దక్ష న్యూస్, హైదరాబాద్: మార్చి 15

త్వరలో లోక్ సభ ఎన్నికలు జరగనున్న వేళ వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నది. లీటర్ పెట్రోల్ పై రూ.2, డీజిల్ పై రూ.2 తగ్గిస్తున్నట్టు కేంద్ర చమురు శాఖ వెల్లడించింది.

Hospital

Read also: యాదాద్రి ఆలయ ఈవోగా భాస్కర్ రావు.. రామకృష్ణ రావుపై ప్రభుత్వం బదిలీ వేటు..

ధరలు తగ్గించిన నేపథ్యంలో, ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.94.72, లీటర్ డీజిల్ రూ. 87.62కు లభించనున్నాయి. తగ్గించిన ధరలు శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వస్తాయని కేంద్ర చమురు శాఖ తెలిపింది. హైదరాబాద్ లో రూ.109.66 ఉన్న లీటర్ పెట్రోల్ ధర రూ.107.66కు చేరింది. రూ.97.82 ఉన్న డీజిల్ ధర రెండు రూపాయలు తగ్గి 95.82కు చేరింది.

Leave A Reply

Your email address will not be published.