Read News in Telugu Language
adsdaksha

ఫోటో వీడియోస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులుగా వన్నం కృష్ణమోహన్..

దక్ష న్యూస్, పినపాక : జనవరి 29

మణుగూరు మండల ఫోటో వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికలు సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్ష పదవి కి ఇద్దరు అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. ఈ ఎన్నికలకు జిల్లా, రాష్ట్ర నాయకులు హాజరయి ప్రజాస్వామ్య పద్ధతి లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్నేహపూరిత వాతావరణం లో ఎన్నికల పోలింగ్ శ్రీహరి డిజిటల్ స్టూడియోలో నిర్వహించారు.

Read also: ఆరేళ్ల కల సాకారమైన వేళ… పొంగులేటి చొరవతో అప్పలనర్సింహాపురానికి బస్సు సర్వీస్..

ఈ ఎన్నికల్లో 46 మంది సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉండగా 45 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ అనంతరం వేణు రెస్టారెంట్ లో కౌంటింగ్ ప్రక్రియ ముగిసింది. వన్నం కృష్ణ మోహన్ కి 38 ఓట్లు రాగ మరో అభ్యర్థి సత్యనారాయణకి 7 ఓట్లు వచ్చాయి. సత్యనారాయణ పై కృష్ణ మోహన్ 31 ఓట్ల మెజారిటీ తో భారీ విజయం పొందారు.

Hospital

Read also: వచ్చే నెలలోనే మెగా ఫుడ్ పార్క్ ప్రారంభోత్సవం..

ఈ సందర్భంగా గెలుపొందిన నూతన అధ్యక్షుడు కృష్ణ మోహన్ మాట్లాడుతూ సంఘ అభివృద్ధి కి తన వంతుగా ప్రయత్నం చేస్తానని సభ్యులకు ఎటువంటి సమస్యలు ఉన్నా పక్షపాతం లేకుండా సహకరిస్తానన్నారు. జిల్లా కమిటీ సభ్యుల ముందు నూతన ప్రధాన కార్యదర్శి గా పుసులూరి శ్రీనివాస్, కోశాధికారి గా శ్రీనివాస్ లను ఎన్నుకున్నారు.. జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతన కమిటీ కి నియామకపత్రాలు అందచేశారు.

Read also: పెద్దమ్మతల్లి దేవాలయంలో కొత్వాల ప్రత్యేక పూజలు..

ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు వేముల నర్సింహా రావు, గుణగంటి సారయ్య, జిల్లా అధ్యక్షుడు కీసర సుధాకరరెడ్డి, జిల్లా కోశాధికారి రామకృష్ణ, జిల్లా ఎన్నికల అధికారి పంపన రమేష్ మణుగూరు మండల ఎన్నికల అధికారులు కరుణాకర్, సీరియాల సురేష్, సహాయకుడు రాపర్తి శ్రీహరి, మణుగూరు మండల అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.