Read News in Telugu Language
adsdaksha

ప్రజాపాలన దరఖాస్తు ఫారాలను విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవు…

దక్ష న్యూస్, పినపాక : జనవరి 5

– తహశీల్దార్ వీరభద్ర ప్రసాద్,

ప్రజా పాలన దరఖాస్తు ఫారాలు స్వీకరించే వేదిక వద్దనే ప్రజాపాలన దరఖాస్తు ఫారాలు అందుబాటులో ఉన్నాయని, ప్రజలు జిరాక్స్ కేంద్రాల వద్ద, మీసేవ సర్వీసు కేంద్రాల వద్ద కొనుగోలు చేయవద్దని పినపాక మండల తహశీల్దార్ వీరభద్ర ప్రసాద్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎవరైనా ప్రజాపాలన దరఖాస్తు ఫారాలు విక్రయించినట్లు తమ దృష్టికి వస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Hospital

read also : తెలంగాణ ఉద్యమకారులను గుర్తించిన ప్రభుత్వానికి ధన్యవాదాలు ..

సమయపాలన పాటిస్తూ ప్రజాపాలన దరఖాస్తు స్వీకరణ కేంద్రాలలో అధికారులు అందుబాటులో ఉన్నారని తాసీల్దార్ తెలిపారు. ప్రజలు ప్రజాపాలన దరఖాస్తులు నింపే క్రమంలో ఏమైనా సలహాలు సూచనలు కావాలంటే ప్రజాపాలన కేంద్రంలో ఉన్న “హెల్ప్ డెస్క్” వద్ద నిర్భయంగా అధికారులను సంప్రదించి, ప్రజాపాలన దరఖాస్తులను పూరించి, అందజేయాలని
తహశీల్దార్ వీరభద్ర ప్రసాద్ కోరారు.

Leave A Reply

Your email address will not be published.