Read News in Telugu Language
adsdaksha

మానవత్వం చాటుకున్న పినపాక పాత్రికేయులు..

దక్ష న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం : జనవరి 8

సమాజంలో పెరుగుతున్న అవినీతిని అక్రమాల్ని అక్షరంతో అంతమొందించేందుకు, ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తున్న పాత్రికేయుల పాత్ర సమాజం లో ఎంతో కీలకమని తోగ్గూడెం ఎంపీటీసీ చింతపంటి సత్యం అన్నారు.
మండలంలోని తోగ్గూడెం గ్రామానికి చెందిన బూరిక ముత్తయ్య ఇటీవల ఇంట్లో నిద్రిస్తుండగా ఇంట్లోని మట్టి గోడ కూలి కాలువిరిగింది. నిరుపేద కుటుంబం కావడంతో వైద్యం చేయించుకునే స్తోమత లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న పినపాక పాత్రికేయుల సంక్షేమ సంఘం సభ్యులు (118/2022), సోమవారం బాధిత కుటుంబానికి బియ్యం, నిత్యవసర సరుకులు, నగదు ను అందజేశారు.

Hospital

Read also: సీతారామ ప్రాజెక్టు పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి ..

ముత్తయ్య ఆరోగ్యం కుదుట పడేవరకు మరిన్ని సహాయ సహకారాలు అందించేందుకు ప్రెస్ క్లబ్ కృషి చేస్తుందని ఈ సందర్భంగా పాత్రికేయులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు, బిల్లా నాగేందర్, ప్రధాన కార్యదర్శి సనప భరత్, గౌరవ అధ్యక్షులు బూర శంకర్, పాత్రికేయులు మహేష్, దొడ్డి శీను,కోటి, దిలీప్, జగదీష్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.