Read News in Telugu Language
adsdaksha

కోటి ఇండ్లకు సోలార్ ప్యానెల్స్ ..

దక్ష న్యూస్, హైదరాబాద్: జనవరి 22

పీఎం సూర్యోదయ యోజన స్కీమ్ ప్రారంభం..

ప్రధాని మోదీ ట్వీట్ ద్వారా వెల్లడి

Hospital

అయోధ్య రామమందిరం ప్రారంభమైన కొద్ది గంటల్లోనే ప్రధాని నరేంద్ర మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. పేద, మధ్య తరగతి కుటుంబాల్లో కరెంటు బిల్లుల భారం తగ్గించేందుకు వారికి సోలార్ వ్యవస్థను చేరువ చేసేందుకు నిర్ణయించారు. ఈ క్రమంలోనే బీజేపీ ప్రభుత్వం కోటి ఇండ్లకు సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేస్తానని ప్రకటించింది. దీని అమలు కోసం ప్రధానమంత్రి సూర్యోదయ యోజన పథకాన్ని ప్రారంభించనున్నారు. అయితే ఈ విషయాన్ని ప్రధాని మోదీ స్వయంగా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు.

Read also: 29న రియల్‌మి 12 ప్రో 5జీ సిరీస్ లాంచ్ ..ఫీచర్స్ చూస్తే మతి పోవాల్సిందే..

అయితే ఈ పథకం ద్వారా పేద, మధ్య తరగతి ప్రజలకు కరెంటు బిల్లు తగ్గుతుందని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. మరోవైపు ఈ పథకం వల్ల ఇంధన రంగంలోనూ భారత్ స్వావలంబన సాధిస్తుందని చెప్పుకొచ్చారు.

Leave A Reply

Your email address will not be published.