Read News in Telugu Language
adsdaksha

బీజేపీ కారిడార్లు నిర్మిస్తోంది : డీఎంకేపై ప్రధాని మోదీ విమర్శలు..

దక్ష న్యూస్, న్యూ ఢిల్లీ: ఏప్రిల్ 10

ప్రధాని మోదీ తమిళనాడు అధికార పార్టీ డీఎంకేపై విమర్శలు గుప్పించారు. పార్టీ ఎప్పుడూ విద్వేషపూరిత రాజకీయాలు చేస్తోందని ప్రదాని  మోదీ  ( pm modi ) ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్రంలోని మెట్టుపాళయంలో బీజేపీ నిర్వహించిన ర్యాలీలో ప్రధాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికార పక్షంతో పాటు ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమిపైనా విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు.

Read also: మంత్రి పొంగులేటి రంజాన్ శుభాకాంక్షలు..

Hospital

డీఎంకే అహంకారంలో మునిగిపోయిందని మోదీ ఆరోపించారు. ఆ పార్టీ.. ‘ఇండియా’ కూటమి ఎజెండా ఒక్కటే. “రాష్ట్ర బీజేపి అధ్యక్షుడు అన్నామలై గురించి అడగ్గా, ఒక డీఎంకే నాయకుడు అహంకారంగా మాట్లాడాడు. ఆయన అవమానకరమైన వ్యాఖ్యలు తమిళ సంస్కృతికి విరుద్ధం. ఈ దురహంకారాన్ని ప్రజలు ఎన్నటికీ సమర్థించరు. డీఎంకే విభజన రాజకీయాల వైపు మొగ్గు చూపుతోంది. రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి సారించడం లేదు. ఎన్డీయే నీలగిరి అభివృద్ధికి ప్రభుత్వం మరింత కృషి చేస్తుందని మోదీ భరోసా ఇచ్చారు.

Read also: శ్రీ క్రోధి కావాలి మహా బోధి.. డా…గిరిసింహారావ్..

తమిళనాడులో బీజేపీ ప్రభుత్వం రక్షణ కారిడార్లను నిర్మిస్తోంది. విభజనతో కూడిన ‘ఇండియా’ కూటమి ఆ పని చేయగలదా అని మోదీ ప్రశ్నించారు. తమిళనాడు అభివృద్ధికి పదేళ్లలో రూ.కోట్లు సంపాదించారు. ఎన్డీయే ప్రభుత్వం 25 కోట్ల మందికి పేదరికం నుంచి విముక్తి కల్పించిందన్నారు. కాంగ్రెస్ హయాంలో రాష్ట్రాల మధ్య వివక్ష ఉండేదని ఆరోపించారు. కానీ… ఎన్డీయే ప్రభుత్వం మాత్రం ‘సబ్కా సాథ్.. సబ్కా వికాస్’ విజన్‌గా పనిచేస్తోందన్నారు. కుటుంబ పార్టీలు తమ వారసుల భవిష్యత్తు గురించి తప్ప.. సామాన్యుల గురించి ఆలోచించడం లేదని విమర్శించారు. పేదరిక నిర్మూలన అంటూ నినాదాలు చేసిన కాంగ్రెస్ దశాబ్దాలుగా దానిని రూపుమాపలేకపోయిందని ప్రధాని మోదీ మండిపడ్డారు.

Leave A Reply

Your email address will not be published.