Read News in Telugu Language
adsdaksha

modi: ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో బీఆర్‌ఎస్‌ నేతలను విడిచి పెట్టలేదు.. అవినీతి చేసిన వారిని కచ్చితంగా జైళ్లో వేస్తాం..

దక్ష న్యూస్, హైదరాబాద్: నవంబర్ 7

బీజేపీని గెలిపిస్తే… బీసీలదే రాజ్యాధికారం..

నీళ్లు, నిధులు, నియామకాలు ఏమయ్యాయ్ కేసిఆర్ : పవన్ కల్యాణ్..

మోడీ అనుభవం మనకు అవసరమని వ్యాఖ్య..

ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో బీఆర్‌ఎస్‌ ( brs ) నేతలను విడిచిపెట్టామని కాంగ్రెస్‌ ( congress ) నేతలు మాపై ఆరోపణలు చేస్తున్నారని, అవినీతి చేసిన వారిని కచ్చితంగా జైళ్లో వేస్తామని ప్రధాని మోడీ ( pm modi ) తేల్చి చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం హైదరాబాద్ ( hyderabad ) ఎల్బీ స్టేడియంలో బీజేపీ ( bjp ) బీసీ ఆత్మ గౌరవ సభ జరిగింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ, పుణ్యభూమి తెలంగాణకు ప్రణామాలు… బీసీ ఆత్మగౌరవ సభలో పాల్గొనడం నా అదృష్టం… మీ ఆశీర్వాదంతోనే నేను ప్రధాని అయ్యాను అన్నారు. ఈ నేలతో నాకు విడదీయరాని అనుబంధం ఉంది అన్నారు. అన్ని వర్గాల ప్రజలు రాష్ట్రంలో మార్పు రావాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. మీ ఆశీర్వాదంతోనే మళ్లీ బీజేపీ బీసీ బిడ్డ తెలంగాణ ముఖ్యమంత్రి అవుతారంటూ మోడీ జోస్యం చెప్పారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే బీసీలకే రాజ్యాధికారం వస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసమే తెలంగాణ ఉద్యమం వచ్చిందని గుర్తుచేశారు.

ప్రత్యేక రాష్ట్రం కోసం ఎందరో అమరులయ్యారని ప్రధాని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ నీళ్లు, నిధులు, నియామకాలపై బీఆర్ఎస్ మోసం చేసిందని ప్రధాని విమర్శించారు. తొమ్మిదేళ్లుగా బీసీ, ఎస్సీ, ఎస్టీ విరోధి అధికారంలో ఉన్నారని ఆయన దుయ్యబట్టారు. తెలంగాణలో మార్పు మొదలైంది.. అదే తుఫాన్‌ ఇక్కడ కనిపిస్తోందన్నారు. తెలంగాణ సర్కార్‌ బీసీలను పట్టించుకోవడం లేదనీ.. బీఆర్‌ఎస్‌కు తన కుటుంబమే ప్రాధాన్యత ఇస్తుందన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి సీ టీమ్‌ బీఆర్‌ఎస్‌. బీఆర్ఎస్, కాంగ్రెస్‌, ఎంఐఎం మూడు పార్టీల డీఎన్ఏ ఒక్కటేనని ప్రధాని మోడీ ఎద్దేవా చేశారు. అవినీతి, కుటుంబపాలన, బుజ్జగింపు రాజకీయాలు వారి లక్షణాలన్నారు.

Hospital

బీసీల ఆకాంక్షలను పట్టించుకునేది బీజేపీ మాత్రమేనని మోదీ అన్నారు. దేశంలో పేదలకు 5ఏళ్లపాటు ఉచిత రేషన్ సరఫరా చేస్తామని ప్రధాని ప్రకటించారు. ఈ నెల (నవంబర్) 30న జరిగే అసెంబ్లీ ఎలక్షన్లలో ఈ విరోధి సర్కార్ ను తరిమి కొట్టాలని మోడీ పిలుపు నిచ్చారు. బీజేపీ సర్కార్ దళిత, ఆదివాసీలకు ప్రియారిటీ ఇస్తోందని తెలిపారు. రామ్ నాథ్ కోవింద్ ను రాష్ట్రపతిని చేశామని.. గిరిజన బిడ్డను ఇప్పుడు రాష్ట్రపతిని చేశామని పీఎం వివరించారు. ఓబీసీలకు ఏ పార్టీ ప్రియారిటీ ఇవ్వలేదని అన్నారు. కేంద్ర కేబినెట్ లో 27 మంది ఓబీసీలున్నారన్నారు. బీసీ వ్యక్తిని ప్రధానిని చేసి నన్ను ఎంతగానో గౌరవించినట్టు గుర్తు చేశారు. టీఎస్పీఎస్సీలో పేపర్ల లీకేజీ నడుస్తోందనీ, దాన్ని అక్రమాల పుట్టను చేశారని విమర్శించారు.

తెలంగాణలో వేల టీచర్ల పోస్టులు ఖాళీగా ఉన్నా భర్తీ చేయడం లేదన్నారు. ఉద్యోగాల పేరు చెప్పి యువతను మోసం చేస్తున్న బీఆర్‌ఎస్‌ ను గద్దె దించాలని మోదీ పిలుపునిచ్చారు. డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్లు ఇస్తామన్న కేసీఆర్ మాట గాలిమూటగా మిగిలిపోయిందని ప్రధాని మోడీ ఆక్షేపించారు.

నీళ్లు, నిధులు, నియామకాలు ఎక్కడ: పవన్ కల్యాణ్

నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ సాధించినా ఇప్పుడు అవి అందని పరిస్థితి అని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ బీసీ ఆత్మగౌరవ సభలో పవన్ కళ్యాణ్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీపై ప్రశంసలు కురిపించారు. దేశానికి మోడీ అనుభవం ఎంతో అవసరం అని.. సీఎంగా, పీఎంగా ఆయన నిర్ణయాలు దేశానికి మార్గనిర్దేశం అయ్యాయి అన్నారు. మోడీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చేస్తే… ఆర్టికల్ 370, ట్రిబుల్ తలాఖ్, మహిళా బిల్లు, రామ మందిరం నిర్మాణం, నోట్ల రద్దు వంటి ఎన్నో సంచలన నిర్ణయాలను భారత దేశం కోసం మోడీ తీసుకున్నారనీ ఆయన గుర్తు చేశారు. దేశ ప్రయోజనాలే లక్ష్యంగా.. ప్రధాని మోడీ పని చేస్తున్నారని.. అందుకే ఆయన అంటే నాకు ఎంతో ఇష్టం అని పవన్ కల్యాణ్ అన్నారు.

కాషాయ జెండాతో మార్పు సాధ్యం : కిషన్ రెడ్డి

తెలంగాణలో కాషాయ జెండాతోనే మార్పు సాధ్యం అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పునరుద్ఘాటించారు. బీసీ ఆత్మగౌరవ సభలో ఆయన ప్రసంగించారు. కాంగ్రెస్ అమ్ముడుపోయే పార్టీ అయితే, బీఆర్ఎస్ కొనుక్కునే పార్టీ అన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, మజ్లిస్ ఒకే తాను ముక్కలని విమర్శించారు. మన్మోహన్ హయాంలో కేసీఆర్ మంత్రిగా ఉన్నారని, బీఆర్ఎస్ నేతలు మంత్రులుగా ఉన్నారని గుర్తు చేశారు. ఈ రెండూ అవినీతి పార్టీలేనని ఆరోపించారు. ఈ రెండు పార్టీల డీఎన్ఏ ఒక్కేటనన్నారు. కాంగ్రెస్ రాష్ట్రపతి అభ్యర్థికి బీఆర్ఎస్ ఘన స్వాగతం పలికిందని, కానీ ద్రౌపది ముర్ము రాష్ట్రపతి అభ్యర్థిగా వస్తే మాత్రం కేసీఆర్ పట్టించుకోలేదని మండిపడ్డారు.

ఈ సభకు ప్రధాని మోడీతో పాటు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, పలువురు బీజేపీ నేతలు హాజరయ్యారు. ఓపెన్ టాప్ జీపులో ప్రజలకు అభివాదం చేస్తూ ప్రధాని మోడీ సభా ప్రాంగణానికి చేరుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.