Read News in Telugu Language
adsdaksha

ప్రధాని పదవికి మోడీ రాజీనామా.. చివరిసారిగా మోడీ నివాసంలో సమావేశం ..హాజరైన బాబు, పవన్..

దక్ష న్యూస్, న్యూఢిల్లీ : జూన్ 5

దేశం కోసం 18 గంటలు శ్రమిస్తా అని నరేంద్రమోడీ అన్నారు. ప్రపంచంలో భారత్ బలమైన శక్తిగా అవతరిస్తుందని, అన్ని ప్రాంతాలు, వివిధ వర్గాల ప్రజల అభివృద్ధికి ఎన్డీయే కూటమి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఎన్డీఏ కూటమి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో బుధవారం పాత కేంద్రమంత్రి వర్గం చివరిసారిగా మోడీ నివాసంలో సమావేశం అయింది. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ, ఈ సారి అవినీతిని రూపుమాపడంపై ఎన్డీఏ ప్రభుత్వం దృష్టి సారిస్తుందని అన్నారు.
ఎన్డీఏకు మెజార్టీ సీట్లు రావటం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

రాజకీయ ప్రయోజనాల కోసం అవినీతిని కొందరు కీర్తిస్తున్నారని ప్రతిపక్షాలను ఉద్దేశించి మోడీ ఆరోపించారు. ప్రపంచంలో భారత్ బలమైన శక్తిగా అవతరిస్తుందని, మనమంతా సమష్టిగా కృషి చేస్తే సరికొత్త అధ్యాయాన్ని లిఖించవచ్చని అన్నారు. ఇదే ప్రజలకు మోదీ హామీ అని అన్నారు. దశాబ్ద కాలంలో దేశ అభివృద్దికి ఎన్డీఏ సర్కార్ ఎంతో కృషి చేసిందని, అందుకు కేంద్రమంత్రులు ఎంతో శ్రమించారని, దీన్నిఇలాగే కొనసాగించాలని సూచించారు.

read also : క్యాన్సర్ ఇప్పుడు ప్రాణాంతకం కాదు.. అత్యాధునిక టెక్నాలజీ తో అరుదైన వైద్యం : డాక్టర్ రాజేందర్..

Hospital

దేశఅభివృద్ధి కోసం నిరంతంరం పని చేస్తున్నానని, కొందరు 10 గంటలు పనిచేస్తే, నేను దేశం కోసం 18 గంటలు శ్రమిస్తా అని మోడీ అన్నారు. వారు రెండు అడుగులు వేస్తే నేను నాలుగు అడుగులతో ముందుకు సాగుతా అని అన్నారు. అన్ని ప్రాంతాలు, వివిధ వర్గాల ప్రజల అభివృద్ధికి ఎన్డీయే కూటమి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఎన్నికల ఫలితాల్లో సంబర్ల గేమ్ కొనసాగుతూనే ఉంటుందని, ఇది రాజకీయాల్లో భాగమేనని అన్నారు.
సమావేశం అనంతరం ప్రధాని తన పదవికి రాజీనామా చేశారు. మోడీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించారు.

read also : క్రికెట్ ప్రియులకోసం ఎయిర్ టెల్ సరికొత్త ప్లాన్ లు.. ఇన్-ఫ్లైట్ కనెక్టివిటీతో రోమింగ్ ప్యాక్‌లు..

ఈ సమావేశంలో లోక్‌సభ ఎన్నికల ఫలితాలు, ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించారు. ఈ సందర్భంగా కొన్ని తీర్మాణాలు చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో నరేంద్ర మోదీ నాయకత్వంలో ఎన్‌డీఏ ఐక్యంగా పోరాడి గెలిచినందుకు మనమందరం గర్విస్తున్నామని తీర్మానంలో పేర్కొన్నారు. మోదీ నాయకత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం పేదలు, మహిళలు, యువత, రైతులు, దోపిడీకి గురవుతున్న అణగారిన వర్గాలకు, అణచివేతకు గురైన భారతీయ పౌరులకు సేవ చేయడానికి కట్టుబడి ఉండాలని నిర్ణయించారు. భారతదేశ వారసత్వాన్ని పరిరక్షించడం ద్వారా భారతదేశం సర్వతోముఖాభివృద్ధి కోసం భారతదేశ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తూనే ఉండాలని తీర్మానించారు. నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వ ప్రజా సంక్షేమ విధానాల వల్ల గత 10 ఏళ్లలో 140 కోట్ల మంది భారత పౌరులు, దేశంలోని అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు. అనంతరం నరేంద్ర మోడీని ఎన్డీఏ తరుపున ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎన్నుకున్నారు.
ఈ సమావేశంలో బీజేపీ సహా 16 పార్టీల నేతలు పాల్గొన్నారు. బీజేపీ నుంచి జేపీ నడ్డా, సీనియర్‌ నేతలు అమిత్‌షా, నితిన్‌ గడ్కరీ, జేడీయూ నుంచి నితీశ్‌ కుమార్‌, తెలుగుదేశం పార్టీ నుంచి చంద్రబాబు నాయుడు, జనసేన నుంచి పవన్‌ కళ్యాణ్‌ హాజరయ్యారు.

ప్రధాని ప్రమాణ స్వీకారానికి ముహుర్తం ఖరారు..

జూన్ 8న మోదీ ప్రధానిగా మరోసారి ప్రమాణ స్వీకారం చేయటానికి ముహూర్తం ఖరారైంది. దిల్లీలోని కర్తవ్యపద్లో ఈ కార్యక్రమం జరగనుంది. ఎంపీ ఎన్నికల ఫలితాల్లో 293 సీట్లు సాధించిన ఎన్డీఏ కూటమి కేంద్రంలో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది.

Leave A Reply

Your email address will not be published.