Read News in Telugu Language
adsdaksha

మల్కాజ్ గిరిలో మోడీ రోడ్ షో కి అపూర్వ స్పందన ..నేడు నాగర్ కర్నూల్ లో భారీ బహిరంగ సభ..

దక్ష న్యూస్, హైదరాబాద్ : మార్చి 16

ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం సాయంత్రం మల్కాజిగిరి ( malkajgiri ) లో భారీ రోడ్ షో నిర్వహించారు. సాయంత్రం 6.15 గంటలకు ప్రారంభమైన రోడ్ షో ( road show ) రాత్రి 7 గంటల వరకు కొనసాగింది. అయితే సాయంత్రం 5.15 గంటలకు రోడ్ షో ప్రారంభం కావాల్సి ఉండగా గంట ఆలస్యంగా ప్రారంభమైంది. ప్రధాని మోదీ ( pm modi ) సాయంత్రం కేరళ నుంచి బేగంపేట ( begam pet ) విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా మల్కాజిగిరి రోడ్‌షోకు వచ్చారు. మిర్జాలగూడ నుంచి ప్రారంభమైన రోడ్ షో మల్కాజిగిరి క్రాస్ వరకు కొనసాగింది. 40 నిమిషాల పాటు దాదాపు 1.5 కి.మీ. బీజేపీ ( bjp ) శ్రేణులు, మోదీ అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

read also : సీఏఏ ఆందోళన కలిగిస్తోంది ..అగ్రదేశం అమెరికా స్పందన..

మిర్జాల గూడలో స్వాగత వేదికను ఏర్పాటు చేసి బీజేపీ నేతలు మోదీకి ఘన స్వాగతం పలికారు. మల్కాజ్‌గారి చౌరస్తాలో ఏర్పాటు చేసిన వేదిక వద్ద మోదీ కి ఘన స్వాగతం లభించింది. సుమారు కిలోమీటరున్నర పాటు సాగిన ఈ రోడ్ షోలో ప్రధాని చిరునవ్వుతో ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు.

Hospital

read also : ఎమ్మెల్సీ కవిత అరెస్ట్.. ఆమె నివాసంలో అదుపులోకి తీసుకున్న ఈడీ..

నేడు నాగర్ కర్నూల్ లో మోడీ బహిరంగసభ..

శనివారం నాగర్ కర్నూల్ లో నిర్వహించే భారీ బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. ఉదయం 10.45 గంటలకు రాజ్‌భవన్‌ నుంచి బయలుదేరి 11 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటలకు నాగర్ కర్నూల్ లోని బహిరంగ సభ స్థలికి వస్తారు. ఆ తర్వాత ఒంటిగంటకు గుల్బర్గా వెళతారు.

Leave A Reply

Your email address will not be published.