Read News in Telugu Language
adsdaksha

దేశాన్ని విభజించే కుట్రలు జరుగుతున్నాయి : రాజ్యసభ ప్రసంగం లో ప్రధాని మోదీ..

దక్ష న్యూస్, న్యూ ఢిల్లీ : పిబ్రవరి 7

దేశాన్ని విభజించేందుకు కొంతమంది కుట్ర పన్నుతున్నారని, ఆ కుట్రలను సహించబోమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. బుధవారం రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ ఆయన మాట్లాడారు. కొంతమంది దక్షిణ భారత దేశం కావాలంటున్నారని, దేశమంటే దేహం లాంటిదని, ముక్కలు కానివ్వబోమని తెలిపారు. ఓ రాష్ట్రం నిధుల కోసం ఢిల్లీలో ధర్నా చేసిందని, మరో రాష్ట్రం మా బొగ్గు మాకే కావాలంటోందని, ఇంకో రాష్ట్రం మా ట్యాక్స్ అంటున్నారని, ఇదెక్కడి న్యాయమంటూ ప్రధాని మోదీ ప్రశ్నించారు.

Hospital

Read also: ఎయిర్ పోర్ట్ తరహాలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి..

రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వానికి వివక్షత లేదని, రాష్ట్రాల హక్కులకు ఎప్పుడూ ప్రాధాన్యం ఇస్తుందని మోదీ చెప్పారు. మరోవైపు కాంగ్రెస్‌పై ప్రధాని మోదీ విరుచుకుపడ్డారు. రానున్న ఎన్నికల్లో ఆ పార్టీకి 40 సీట్లు సైతం రాబోవని, ఆ పార్టీ మూలాలే బ్రిటీషర్లంటూ చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని, పత్రికా స్వేచ్ఛకు విఘాతం కలిగించిందే కాంగ్రెస్ ప్రభుత్వమని ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు.

Leave A Reply

Your email address will not be published.