Read News in Telugu Language
adsdaksha

తెలంగాణ సొమ్ము ఢిల్లీ కి చేరుతోంది.. ఒక దోపిడీదారుడు మరొక దోపిడీదారుడితో పోరాడలేడు : మోదీ

దక్ష న్యూస్, జగిత్యాల : మార్చి 18

తెలంగాణను దోచుకున్న వారిని వదిలిపెట్టబోమని ప్రధాని నరేంద్రమోదీ ( pm narendra modi ) అన్నారు. కుటుంబ పార్టీలు దేశాన్ని దోచుకునేందుకే రాజకీయాలు చేస్తున్నాయని, దేశంలో ఏ దోపిడీ జరిగినా దాని వెనుక కుటుంబ పార్టీల హస్తం ఉందని, 2జీ స్పెక్ట్రమ్ కేసులో డీఎంకే పేరు బయటికి వచ్చిందని, అది కుటుంబ పార్టీ అని, నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ పేరు బయటికి వచ్చిందని అన్నారు. అది కూడా కుటుంబ పార్టీ.. ఇప్పుడు ఆ లిస్టులో బీఆర్ఎస్ చేరిందన్నారు. కాళేశ్వరం, ఢిల్లీ మద్యంకేసు లో కూడా అవినీతికి పాల్పడ్డారని మోదీ ధ్వజమెత్తారు.

read also : ఈసీ కొత్త మొబైల్ యాప్ ..అరచేతిలో అభ్యర్థుల సమాచారం..

Hospital

కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకరినొకరు కాపాడుకుంటున్నారని ప్రధాని మోదీ విమర్శించారు. జగిత్యాలలో జరిగిన బీజేపీ విజయ సంకల్ప సభలో ఆయన మాట్లాడారు. ‘తెలంగాణలో బీజేపీకి ఆదరణ పెరుగుతోందని మోదీ పేర్కొన్నారు.

read also : ఎలక్టోరల్ బాండ్ల లెక్క బయట పెట్టిన ఈసీ.. అత్యధిక బాండ్లు బీజేపీ పార్టీకే ..

వచ్చే ఎన్నికల్లో బీజేపీకి 400కు పైగా సీట్లు రావడం ఖాయమ మోదీ అన్నారు. నేను భారతమాతకు పూజారిని. తెలంగాణ.. బ్రిటిష్ వారితో, రజాకార్లతో పోరాడిన నేల. భారతదేశం తెలంగాణ ప్రజలను దోచుకుంది. ఇప్పుడు రాష్ట్రాన్ని కాంగ్రెస్ తన ఏటీఎంగా మార్చుకుంది. ఒక దోపిడీదారుడు మరొక దోపిడీదారుడితో పోరాడలేడని ప్రజలకు తెలుసు. బీఆర్ఎస్ తెలంగాణను దోచుకోవడంపై కాంగ్రెస్ మౌనంగా ఉంది. తెలంగాణ సొమ్ము ఇప్పుడు ఢిల్లీకి చేరుతోందని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.

Leave A Reply

Your email address will not be published.