Read News in Telugu Language
adsdaksha

భారత్‌కు నారీ శక్తి, యువశక్తి బలం..

దేశ యువత టెక్నాలజీ లో ముందున్నారు..

భిన్నత్వంలో ఏకత్వం, మానవ వనరులు, ప్రజాస్వామ్యం మన ప్రత్యేకతలు ..

గత పదేళ్లుగా భారత్ గొప్పతనాన్ని ప్రపంచం గుర్తిస్తోందని ప్రధాని మోదీ ( PM Narendra Modi ) అన్నారు. 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రధాని ఎర్రకోట ( yerrakota) పై జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం జాతినుద్దేశించి ప్రధాని ప్రసంగించారు. ఈ సందర్భంగా పలు విషయాలను ప్రముఖంగా ప్రస్తావించారు. తొలుత ప్రధాని దేశ ప్రజలందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనది. దేశంకోసం ఎంతో మంది త్యాగం చేశారు. అమరవీరుల త్యాగఫలమే స్వాతంత్రం అని ప్రధాని అన్నారు. ప్రపంచం మొత్తం భారత్‌వైపే చూస్తోందని, డిజిటల్ ఇండియాను ప్రపంచం గమనిస్తోందని పేర్కొన్నారు. మానవ వనరులు, ప్రజాస్వామ్యం, భిన్నత్వంలో ఏకత్వమే మన ప్రత్యేకత అని తెలిపారు. గత పదేళ్లలో భారత్ ఎంతో వేగంగా అభివృద్ధి చెందిందని, నారీ శక్తి, యువశక్తి భారత్‌కు బలమని తెలిపారు. భారత్‌లో యువశక్తి ఎంతో అద్భుతంగా ఉందన్నారు. భారతీయ యువత టెక్నాలజీ విషయంలో ముందున్నారని, భారత్‌లో యువతకు అవకాశాలు మెండుగా ఉన్నాయని ప్రధాని మోదీ అన్నారు. ఆధునికతవైపు దేశం అడుగులు వేస్తోందని చెప్పారు.

read also : బిఆర్ఎస్ లో క్రాంతికారి షేత్కారి పార్టీ విలీనం..

Hospital

ఎర్రకోట వేదికగా ప్రధాని మోదీ తన ప్రసంగంలో మణిపుర్ అంశాన్ని ప్రస్తావించారు. మణిపుర్‌లో జరిగిన హింస అత్యంత బాధాకరమైందని, దేశ ప్రజలంతా మణిపుర్‌కు అండగా ఉన్నారన్నారు. మణిపుర్‌లో శాంతి స్థాపనకు కేంద్రం సహకరిస్తుందని, మణిపుర్‌లో పరిస్థితులు మెరుగుపడుతున్నాయని ప్రధాని తెలిపారు.

భారత దేశ గొప్పతనాన్ని గత పదేళ్లుగా ప్రపంచం గుర్తిస్తోందని ప్రధాని అన్నారు. శాటిలైట్ రంగంలో మనమే ముందున్నామని, రాబోయే కాలాన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ శాసిస్తుందని చెప్పారు. కరోనా కాలంలో మనమేంటో ప్రపంచానికి తెలిసింది. కరోనాను భారత్ కలిసికట్టుగా ఎదుర్కొందని అన్నారు. సుస్థిర శక్తివంతమైన ప్రభుత్వం భారత్‌కు అవసరం అని, సుస్థిర ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని వక్కాణించారు. 140 కోట్ల ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తున్నామని, మరో వెయ్యేళ్లు భారత్ వెలుగుతూనే ఉంటుందని ప్రధాని మోదీ చెప్పారు.

read also : రైతులకు పంద్రాగష్టు తీపికబురు .. రుణమాఫీ కి నిధులు మంజూరు..

Leave A Reply

Your email address will not be published.