Read News in Telugu Language
adsdaksha

pmegp : పీఎంఇజిపి స్కీమ్ తో యువత కలలు సాకారం..

దక్ష న్యూస్, ఖమ్మం : మార్చి 20

బ్రహ్మండమైన బిజినెస్ ఐడియా మీవద్ద ఉండి కూడా తగిన పెట్టుబడి లేక బాదపడుతున్నారా.. డిగ్రీలు పీజీలు ఉన్నా సరైన ఉద్యోగం రాక సతమతమవుతున్నారా.. కష్టపడి పనిచేసే శక్తి, అద్బుతాలు సాధించే క్రియేటివిటి ఉన్నా దురదృష్టాన్ని నిందిస్తూ బిజినెస్ డెవలప్ చేసుకోలేక మదనపడుతున్నారా.. ఇప్పుడలాంటి అవసరమే లేదు. మీకు దగ్గరలోని ఏదైనా ప్రభుత్వరంగ బ్యాంకును సంప్రదించి మీ ఐడియాలజీని ప్రాజెక్టు రిపోర్ట్ రూపంలో సమర్పించండి. పిఎంఇజిపి స్కీమ్ తో మీకలలు సాకారం చేసుకోవడమే కాదు.. మరో పదిమందికి ఉపాధి కల్పించి యువశక్తి సత్తాను కాలరెగరేసి చాటండి.

పిఎంఇజిపి స్కీమ్ అంటే..

కేంద్ర ప్రభుత్వం యువశక్తి ని ప్రోత్సహించి ఓత్సాహికులకు ప్రోత్సాహం అందించే ఉద్దేశ్యంతో ఏర్పాటు చేసిందే పిఎంఇజిపి ( ప్రధాన మంత్రి ఎంప్లాయ్ మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ ) పధకం. ఇందులో దరఖాస్తు చేసుకోవడానికి 18 సంవత్సరాలు నిండినవారు అర్హులు. కేవలం 8వ తరగతి పాసైతే చాలు. తయారీ రంగ పరిశ్రమలకు రూ. 50 లక్షల లోపు రుణం, సేవారంగంలో ఉన్నవారికి రూ. 30 లక్షల లోపు రుణం ఇస్తారు. అవీ నూతన పరిశ్రమలు మాత్రమే అయి ఉండాలి. రూ. పదిలక్షలు మించిన తయారీ రంగ పరిశ్రమలు, రూ. 5 లక్షలు దాటిన సేవా పరిశ్రమల అభ్యర్థులకు మాత్రమే 8వ తరగతి ఉత్తీర్ణత పత్రం సమర్పించాల్సి ఉంటుంది.

read also : సార్వత్రిక ఎన్నికలకు తొలి నోటిఫికేషన్ విడుదల .. ఏప్రిల్ 19న తొలి దశ పోలింగ్ ..

దరఖాస్తు చేయడం ఎలా..

Hospital

1) పరిశ్రమల స్థాపన అనుమతులకోసం – wwwts ipass.telangana.gov.in
2) పరిశ్రమల రాయితీ కొరకు – www.tsipass.telangana.gov.in
3) పిఎంఇజిపి లో పరిశ్రమ స్థాపన కొరకు – www.kviconline.gov.in
ఆన్లైన్ లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.

లబ్దిదారుని పెట్టుబడి – సబ్సిడీ శాతం..

సాదారణ విభాగంలో లబ్దిదారుడు ప్రాజెక్టు వ్యయంలో 10 శాతం పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. పట్టణ పరిథిలో 15 శాతం, గ్రామీణ ప్రాంతంలో 25 శాతం సబ్సిడీ లభిస్తుంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ వికలాంగులు, మహిళలు, మాజీ సైనికోద్యోగులు ప్రాజెక్టు వ్యయంలో 5 శాతం డిపాజిట్ చేస్తే సరిపోతుంది. వీరికి పట్టణ ప్రాంతంలో 25 శాతం సబ్సిడీ, గ్రామీణ ప్రాంతంలో 35 శాతం సబ్సిడీ లభిస్తుంది. భారత ప్రభుత్వం 2008 లో ఈ పథకం ప్రారంభించింది. బ్యాంకు రుణం ద్వారా ప్రాజెక్టును నెలకొల్పితే ప్రభుత్వం బ్యాంకుకు సబ్సిడీ చెల్లిస్తుంది.

ఇదీ ప్రాసెస్..

1) ఆధార్ కార్డు, పాన్ కార్డు, కుల దృవీకరణ పత్రం, విద్యా అర్హత దృవీకరణ పత్రం, పాస్ ఫోటో లతో పీఎం ఇజిపి కొరకు జిల్లా పరిశ్రమల కేంద్రం కి అప్లికేషన్ సమర్పించాలి.
2) డిఐసి వారు అప్లికేషన్ ను తనిఖీ చేసి బ్యాంకు రుణం కోసం పంపిస్తారు.
3) బ్యాంకు వారు మీ అప్లికేషన్ ని ఆన్లైన్ చేసి పీఎంఇజిపి పోర్టల్ లో శాంక్షన్ చేస్తారు.
4) బ్యాంకు మీ అప్లికేషన్ ఆన్ లైన్ పోర్టల్ లో శాంక్షన్ చేశాక ఇడిపి ఆన్లైన్ ట్రైనింగ్ లో శిక్షణ పొంది సర్టిఫికెట్ సంపాదించాలి.
5) అనంతరం బ్యాంకులో 5 లేదా 10 శాతం మార్జిన్ మనీ ని లబ్దిదారుడు జమ చేయాలి.
6) ఇడిపి సర్టిఫికెట్ పొందిన తర్వాత మాత్రమే బ్యాంకు వారు లోన్ మొత్తం చెల్లిస్తారు.
7) బ్యాంకు లోన్ ఇచ్చిన తర్వాత పీఎం ఇజిపి సబ్సిడీ కొరకు ఆన్ లైన్ పోర్టల్ లో కెవిఐసి కి దరఖాస్తు చేస్తారు.

Leave A Reply

Your email address will not be published.