Read News in Telugu Language
adsdaksha

అదిరిపోయే ఫీచర్ లతో పోకో F6 5జీ ఫోన్.. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌లపై 5 శాతం క్యాష్‌బ్యాక్..

దక్ష న్యూస్, ఇంటర్ నెట్ డెస్క్ : మే 29

కొత్త ఫోన్ కొనాలనుకుంటుంన్నారా..! ఫీచర్ లు బ్రహ్మాండంగా ఉండాలనుకుంటుంన్నారా అయితే మీ కోసమే భారత మార్కెట్లో మొదటిసారిగా పోకో F6 5జీ ఫోన్ సేల్ ( Poco F6 5G sale ) ప్రారంభమైంది. ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ వేదికగా పోకో ఎఫ్6 ఫోన్ అమ్మకానికి అందుబాటులో ఉంది. క్వాల్‌కామ్ కొత్త స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జనరేషన్ 3 ఎస్ఓసీతో పోకో ఎఫ్ సిరీస్ స్మార్ట్‌ఫోన్ గత వారం దేశంలో లాంచ్ అయింది.

ఈ ఫోన్ మొత్తం 3 ర్యామ్, స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లతో రెండు వేరియంట్లలో వస్తుంది. పోకో F6 5జీ ఫోన్ 1.5కె రిజల్యూషన్‌తో ఓఎల్ఈడీ డిస్‌ప్లేను కలిగి ఉంది. 50ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ దీని ప్రత్యేకత.

పోకో F6 5జీ ఫోన్ ధర, సేల్ ఆఫర్లు :

భారత మార్కెట్లో పోకో F6 5జీ ఫోన్ బేస్ 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ప్రారంభ ధర రూ. 29,999 గా ఉంది. అదే సమయంలో 12జీబీ ర్యామ్+256జీబీ, 12జీబీ + 512జీబీ ఆప్షన్లు వరుసగా ధర రూ. 31,999, రూ.33,999కు లభిస్తున్నాయి. బ్లాక్, టైటానియం కలర్ అందుబాటులో ఉంది. ఈ హ్యాండ్‌సెట్ ఈరోజు మధ్యాహ్నం నుండి ఫ్లిప్‌కార్ట్‌లో విక్రయానికి అందుబాటులో ఉంది.

Hospital

ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌లపై 5 శాతం క్యాష్‌బ్యాక్ అందిస్తోంది. HDFC, ICICI, SBI కార్డ్ వినియోగదారులు లావాదేవీలపై రూ. 2వేలు తగ్గింపు అందిస్తోంది. ఈ పోకో 5జీ ఫోన్ ప్రారంభ ధర రూ. 25,999కు పొందవచ్చు. 12జీబీ+ 256జీబీ, 12జీబీ + 512జీబీ ర్యామ్, స్టోరేజ్ వెర్షన్‌లను వరుసగా రూ.27,999, రూ. 29,999కి కొనుగోలు చేయవచ్చు. నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లలో నెలకు రూ.2,500 నుంచి ప్రారంభమవుతాయి.

read also : డాక్టర్ కాని డాక్టర్ .. పేదల పాలిట వైద్యనారాయణుడు..

పోకో F6 5జీలోని కనెక్టివిటీ ఆప్షన్లలో 5జీ, వై-ఫై 6, బ్లూటూత్ 5.4, జీపీఎస్/ఏజీపీఎస్, గెలీలియో, గ్లోనాస్, బీడౌ, యూఎస్‌బీ టైప్-సి పోర్ట్ ఉన్నాయి. బోర్డ్‌లోని సెన్సార్‌లలో యాక్సిలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, ఇ-కంపాస్, గైరోస్కోప్, ఐఆర్ బ్లాస్టర్, ప్రాక్సిమిటీ సెన్సార్ ఉన్నాయి. దుమ్ము, స్ప్లాష్ నిరోధకతకు ఐపీ64-రేట్ అయింది. ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. ఫేస్ అన్‌లాక్‌కు సపోర్టు ఇస్తుంది.

ఆప్టిక్స్ విషయానికి వస్తే.. పోకో F6 5జీ ఫోన్ 50ఎంపీ 1/1.9-అంగుళాల సోనీ ఐఎమ్ఎక్స్882 సెన్సార్, 8ఎంపీ సోనీ ఐఎమ్ఎక్స్355 అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరాతో కూడిన డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంది. సెల్ఫీలు, వీడియో చాట్‌లకు 20ఎంపీ ఓవీ20బీ ఫ్రంట్ కెమెరా ఉంది. 512జీబీ వరకు యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీని కలిగి ఉంటుంది.

పోకో F6 5జీ స్పెసిఫికేషన్లు :
పోకో F6 5జీ ఫోన్ ఆండ్రాయిడ్ 14-ఆధారిత హైపర్ఓఎస్ ఇంటర్‌ఫేస్‌పై రన్ అవుతుంది. 6.67-అంగుళాల 1.5కె (1,220×2,712 పిక్సెల్‌లు) రిజల్యూషన్ అమోల్డ్ డిస్‌ప్లే 120హెచ్‌జెడ్ వరకు రిఫ్రెష్ రేట్, 446పీపీఐ పిక్సెల్ డెన్సిటీని కలిగి ఉంటుంది. మూడు ప్రధాన ఆండ్రాయిడ్ అప్‌డేట్‌లు, నాలుగు సంవత్సరాల సెక్యూరిటీ ప్యాచ్‌లను స్వీకరించింది. ఈ 5జీ ఫోన్ 12జీబీ వరకు ఎల్‌పీపీ‌డీడీఆర్5ఎక్స్ ర్యామ్‌తో ఆక్టా-కోర్ 4ఎన్ఎమ్ స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జనరేషన్ 3 ఎస్ఓసీతో రన్ అవుతుంది.

 

 

Leave A Reply

Your email address will not be published.