Read News in Telugu Language
adsdaksha

పార్లమెంట్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పనిచేయాలి – పొదెం వీరయ్య..

దక్ష న్యూస్, సత్తుపల్లి : ఫిబ్రవరి 4

రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్ లో అందరూ కలిసి మెలిసి పనిచేయాలని, స్థానిక ఎమ్మెల్యే తో కలిసి పార్లమెంట్ ఎలక్షన్స్ లో గెలుపు కోసం కృషి చేయాలని టీపీసీసీ ఉపాధ్యక్షులు, డిసిసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు భద్రాచలం మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్య అన్నారు. గ్రామ గ్రామాల్లో మీటింగ్ లు ఏర్పాటు చేయాలని, పార్టీని మరింత బలోపేతం చేయాలని కోరారు.

ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం సరోజనపురం గ్రామంలో డీసీసీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జనరల్ సెక్రటరీ మద్దిశెట్టి సామెలు నివాసంలో కాంగ్రెస్ పార్టీ సమావేశం ఏర్పాటు చేశారు.

Read also: 7 న ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన పథకం పై అవగాహన సదస్సు..

సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు మేరకు సమావేశానికి హాజరవ్వడం జరిగిందన్నారు. మద్దిశెట్టి సామేలు కాంగ్రెస్ పార్టీ లో జాయిన్ అవ్వడం వల్ల పార్టీకి మరింత బలం చేకూరుతుందనీ, ఆయనికి ఉన్న రెండు లక్షల మంది ప్రజా బలం పార్టీ గెలుపుకి ఎంతో ఉపయోగం అన్నారు. రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్ లో మద్దిశెట్టి ప్రభావం ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Read also: 23 ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు..

Hospital

గత బిఆర్ఎస్ ప్రభుత్వం భద్రాచలం లోని శ్రీ రాముని గుడికి తీరనీ అన్యాయం చేసిందని పోదెం వీరయ్య అన్నారు. కేసీఆర్ సీఎం అయినప్పుడు భద్రాచలం గుడికి 100 కోట్లు ఇస్తామన్నారు. రెండోసారి హరీష్ రావు 1000 కోట్లు ఇస్తామన్నారు. కానీ ఇప్పటివరకు వాళ్లు 100 రూపాయలు కూడా ఇవ్వలేదని, పైగా ఆరు గ్యారంటీలపై కామెంట్ చేస్తున్నారని ద్వజమెత్తారు.

రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్ లో అందరూ కలిసి మెలిసి పనిచేయాలని, స్థానిక ఎమ్మెల్యే తో కలిసి పార్లమెంట్ ఎలక్షన్స్ గెలుపు కోసం కృషి చేయాలని, గ్రామ గ్రామాల్లో మీటింగ్ లు ఏర్పాటు చేయాలని, పార్టీని మరింత బలోపేతం చేయాలని కోరారు.

Read also: బీజేపీలో చేరమన్నారు.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు..

ఈ కార్యక్రమంలో దమ్మపేట మండల అధ్యక్షులు మద్దిశెట్టి సత్యప్రసాద్, వైస్ ప్రెసిడెంట్ కూకలకుంట నాగబాబు, కిసాన్ సెల్ జిల్లా కార్యదర్శి చీకటి శ్రీనివాసరావు, జిల్లా మహిళా కార్యదర్శి పొదిలి జ్యోతి, బి బ్లాక్ అధ్యక్షురాలు సున్నం లక్ష్మి, కిసాన్ సెల్ మండల అధ్యక్షులు షేక్ షుకుర్, ఓబీసీ సెల్ మండల అధ్యక్షులు వెలివెల శ్రీను, అశ్వరావుపేట నియోజకవర్గ సోషల్ మీడియా కొకోర్డినేటర్ చీకటి శ్రీను, ఆర్ల వెంకటేశ్వరావు, రాళ్లపల్లి రాంబాబు, ఓడే వెంకట్రావు, వంకా బాబూరావు, కందుల రవి, పార్వతి, రమేష్, చిట్టిమళ్ల కేశవరావు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.