Read News in Telugu Language
adsdaksha

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : పోలీస్ కమిషనర్ సునీల్ దత్

దక్ష న్యూస్, ఖమ్మం : ఏప్రిల్ 14

భారత రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఖమ్మం ( khammam )  పోలీస్ కమీషనర్ సునీల్ దత్ అన్నారు. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ఖమ్మం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాత పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ( police commissioner sunil dutt ) అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

read also : మెరిసి మురిసిన ఖమ్మం.. ఘనంగా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ద్వితీయ వార్షికోత్సవ సంబరాలు..

Hospital

ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ సునీల్ దత్ మాట్లాడుతూ…
అంబేద్కర్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం, జాతి నిర్మాణం కోసం అంబేద్కర్ చేసిన సేవలు అనితర సాధ్యమని కొనియాడారు. భారత రాజ్యాంగం పునాదులపైనే ప్రజాస్వామ్య దేశంగా భారతదేశం నిలబడడం జరిగిందన్నారు.

కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ ఆడ్మీన్ నరేష్ కుమార్, ఏఆర్ ఏసీపీ నర్సయ్య, ఆర్ ఐలు కామరాజు, శ్రీశైలం, సురేష్, స్పెషల్ బ్రాంచ్ సిఐలు సతీష్, హానూక్ పాల్గొన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.