Read News in Telugu Language
adsdaksha

శాంతి భద్రతల పరిరక్షణలో ఖమ్మం పోలీస్ సేవలు అభినందనీయం..

దక్ష న్యూస్, ఖమ్మం : ఆగస్ట్ 24

ఖమ్మం కమిషనరేట్ ఒక భవనం మాత్రమే కాదని.. జిల్లా శాంతి భద్రతలకు చిహ్నం అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ( puvvada ajay kumar ) అన్నారు. ఖమ్మం ( khammam ) జిల్లాలో ఎక్కడ ఎలాంటి దుర్ఘటనలు లేకుండా శాంతి భద్రతల పరిరక్షణలో పోలీస్ శాఖ అందిస్తున్న సేవలు అభినందనీయమని కొనియాడారు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని పోలీస్ కమిషనరేట్ ( police commissionerete ) లో నూతనంగా ఏర్పాటు చేసిన 50 అడుగుల జాతీయ జెండాతో కూడిన హై మాస్ట్ ఫ్లాగ్ పోల్ ను గురువారం రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఖమ్మం కమిషనరేట్ శాంతి భద్రతల చిహ్నంగా నిలిచిందన్నారు.

గతంలో కమాండ్ కంట్రోల్ భవనంగా ఉన్న దాన్ని నాడు తాను ఎమ్మేల్యేగా ఉన్న సమయంలో అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరు పోలీస్ కమిషనరేట్ లుగా చేస్తూ బిల్లు పెట్టే క్రమంలో ఖమ్మం కు కూడా కమిషనరేట్ హోదా కల్పించాలని చేసిన విజ్ఞప్తి మేరకు సానుకూలంగా స్పందించి కేసీఅర్ ఖమ్మంను కూడా కమిషనరేట్ బిల్లులో చేర్చి 7వ పోలీస్ కమిషనరేట్ గా బిల్లులో పెట్టి ఆమోదించారని గుర్తు చేశారు.

read also : భద్రాద్రి కొత్తగూడెంలో మంత్రి పువ్వాడ విస్తృత పర్యటన..

ఇది కేవలం బిల్డింగ్ మాత్రమే కాదని పౌరులకు సామాజిక భద్రత కల్పించే భరోసా కేంద్రం అని స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లాలో అనేక సందర్భాల్లో పోలీస్ శాఖ అందిస్తున్న సేవలు అభినందనీయం అని, జిల్లా వ్యాప్తంగా ఫ్రెండ్లీ పోలీసింగ్ తో ఎక్కడ ఎలాంటి ఇబ్బందులూ లేకుండా ప్రజలకు భద్రత, భరోసా కల్పిస్తూ మంచి జీవన విధానంకు కృషి చేస్తున్న పోలీస్ శాఖను అభినందిస్తున్నానని చెప్పారు.

Hospital

ముఖ్యంగా కోవిడ్ సమయాల్లో పోలీసుల సేవలు ప్రజలు ఎప్పుడూ మరిచిపోలేరని మంత్రి పువ్వాడ అన్నారు. కుటుంబాలకు దూరంగా ఉంటూ ప్రజల ప్రాణాలను కాపాడేందుకు చేసిన సహాయక చర్యలు, భద్రత చర్యలు అభినందనీయం అన్నారు. మున్నేరు ముంపు ప్రాంతంలో నిర్విరామ సేవలు అందించి ఒక్క ప్రాణం కూడా పోకుండా ప్రతి ఒక్కరిని క్షేమంగా సురక్షిత స్థానాలకు తరలించిన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపారు.

ఇటీవలే చిమలపాడు గ్రామంలో జరిగిన ఘటనలో ప్రజలు భయబ్రాంతులకు గురి కాకుండా పోలీస్ వ్యవస్థ పటిష్ట సేవలు అందించారని, దురదృష్టవశాత్తు నవీన్ అనే హెడ్ కానిస్టేబుల్ కాలు కోల్పోవడం బాధాకరమని అన్నారు. వారి ధైర్య సహసానికి సెల్యూట్ చేస్తున్నామన్నారు. విధి నిర్వహణలో భాగంగా నిత్యం అనేక ప్రాంతాల్లో తిరుగుతున్న క్రమంలో నిత్యం తన వెంటే ఉంటు ఎప్పటికప్పుడు పోలీస్ సేవలు అందిస్తున్న ప్రతి ఒక్క సిబ్బందికి నా ప్రత్యేక కృతజ్ఞతలు అంటూ ధన్యవాదాలు తెలిపారు.

జిల్లా పోలీస్ కమిషనరేట్ అవరణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా పోలీస్ శాఖ అధ్వర్యంలో రూపొందించిన వెబ్ సైట్ ను మంత్రి ప్రారంభించారు. అనంతరం ఇటీవలే మున్నేరు వరదల్లో ప్రమాద స్థాయిలో పని చేసి ప్రాణాలకు తెగించి పౌరులను కాపాడిన ఉత్తమ పోలీస్ సిబ్బంది (30 మంది) కి ప్రశంసా పత్రాలు అందజేశారు.

read also : మంత్రి మల్లన్న ఎంపీ నామాలే నాకు ఆదర్శం..ఎంపీ వద్దిరాజు రవిచంద్ర

జిల్లా పోలీస్ కమిషనర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మేయర్ పునుకొల్లు నీరజ, జిల్లా కలెక్టర్ V.P.గౌతమ్, సుడా చైర్మన్ విజయ్ కుమార్, కార్పొరేటర్ గజ్జెల లక్ష్మీ, అదనపు డీసీపీ కుమార స్వామి, ASC బోస్, ACP లు PV గణేష్, బస్వా రెడ్డి, రెహమాన్, రామానుజం, ప్రసన్న కుమార్, సారంగపాణీ, రవి, CI లు సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.