Read News in Telugu Language
adsdaksha

కానిస్టేబుల్ గా సెలక్టైన అభ్యర్థుల నిరీక్షణకు తెర .. నేడు ఎల్బీస్టేడియంలో సీఎం రేవంత్ చేతుల మీదుగా అపాయింట్మెంట్స్ ..

దక్ష న్యూస్, హైదరాబాద్ : ఫిబ్రవరి 14

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ కు సంబంధించిన ప్రక్రియ తుది ఘట్టానికి చేరుకుంది. ఇటీవల కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ సర్కార్ దాన్ని పూర్తి చేస్తోంది. తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి (టీఎస్ఎల్పీఆర్బీ) 2022 ఏప్రిల్లో నోటిఫికేషన్ జారీ చేసి ఎగ్జామ్స్ నిర్వహించింది. ఈమేరకు గతేడాది అక్టోబరులోనే తుది ఎంపిక జాబితా ప్రకటించింది. ఫలితాలు ఇచ్చి ఇన్నాళ్లు వాటిని పెండింగ్ లో పెట్టింది కేసీఆర్ గవర్నమెంట్. పోలీస్, ఎక్సైజ్, అగ్నిమాపక, రవాణా, జైళ్లు, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్పీఎఫ్) విభాగాల కోసం 12,866 మంది పురుషులు 2,884 మంది మహిళా అభ్యర్థులను ఎంపిక చేసింది. అయితే దానిపై దృష్టి పెట్టిన ముఖ్యమంత్రి పోలీసు ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వారికి వెంటనే అపాయింట్మెంట్స్ ఇచ్చేయాలని హోంశాఖను ఆదేశించడంతో వెంటనే ఏర్పాట్లు చేశారు.

Hospital

read also : రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ ఎమ్మార్వో.. రైతు నుంచి పది లక్షలు లంచం డిమాండ్..

కాగా సీఎం రేవంత్ రెడ్డి బుధవారం ఎల్బీ స్టేడియంలో జరిగే కార్యక్రమంలో ఎంపిక పత్రాలను అందజేయనున్నారు. ఈ మేరకు హోంశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మరోవైపు కొన్నింటికి అర్హులు లేకపోవడంతో 854 పోస్టులను బ్యాక్ లాగ్ లో పెట్టారు. పోలీసు రవాణా సంస్థలో 100 డ్రైవర్ పోస్టులతోపాటు అగ్నిమాపకశాఖలో 225 డ్రైవర్ ఆపరేటర్ పోస్టులకు సంబంధించిన తుది ఎంపిక ఫలితాలను మాత్రం కోర్టు కేసుల ద్వారా ప్రకటించలేదు. ఇటీవల ఆ అడ్డంకులు తొలిగిపోవడంతో సీఎం రేవంత్ వాటిని వెంటనే పూర్తిచేయాలని ఆదేశాలు ఇవ్వడంతో పోలీసు నియామకాలు నేటితో పూర్తికానున్నాయి.

Leave A Reply

Your email address will not be published.