Read News in Telugu Language
adsdaksha

వదిన బైలెల్లినాదో..

దక్ష న్యూస్, ఖమ్మం: అక్టోబర్ 22

గడప గడపకు కాంగ్రెస్ లో పొంగులేటి మాధురి..

బతుకమ్మను తలకెత్తుకొని భర్త గెలుపుకై ప్రత్యేక పూజలు..

ఆట పాటలతో సందడి చేసిన పొంగులేటి సతీమణి ..

తెలంగాణ ( telangana ) కాంగ్రెస్ ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ( ponguleti srinivasreddy ) అధిష్టానం తనకు అప్పగించిన బాద్యతలతో బిజీగా ఉంటే, ఆయన పోటీ చేయబోయే పాలేరు నియోజక వర్గం లో ప్రచారం బాద్యతలను ఆయన సోదరుడు పొంగులేటి ప్రసాదరెడ్డి ( prasad reddy ) ఇప్పటికే తన భుజస్కందాలపై వేసుకొని అన్నకు తగ్గ తమ్ముడిగా ప్రచారంలో దూసుకుపోతూ ప్రజల మన్ననలు అందుకుంటుంన్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డిని తలపించేలా చెదరని చిరునవ్వుతో చేతులు జోడించి కనిపించిన ప్రతీ ఒక్కరికీ సంస్కారం ఉట్టిపడేలా నమస్కరిస్తూ ముందుకుసాగే వారి ప్రచారంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి సతీమణి మాధురి ( ponguleti madhuri ) కూడా జత కలిశారు. ఆదివారం సద్దుల బతుకమ్మ సందర్భంగా నేలకొండపల్లి మండలం గువ్వల గూడెంలో మహిళలతో కలిసి బతుకమ్మలాడారు. తన భర్తను రాబోయే ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని పూజలు నిర్వహించి, భారీ బతుకమ్మను తలపై ఎత్తుకొన్నారు.

Hospital

read also : తెలంగాణ ప్రజాప్రతినిధుల నేర చరిత్ర.. అధికార పార్టీలోనే 59 మంది..

నిత్యం ప్రజల మధ్య ఉంటూ, కనిపించిన ప్రతీ ఒక్కరినీ వరసలతో పిలుస్తూ, ఆప్యాయతను పంచే పొంగులేటి శ్రీనివాసరెడ్డి సతీమణి తమ మధ్యకు రావడంతో శీనన్న భార్య వదినమ్మ వచ్చిందంటూ అభిమానులు ఆమెను చూసేందుకు భారీగా తరలివచ్చారు. మాధురి మహిళలతో కలిసి బతకమ్మలాడి వారిని ఉత్సాహపరిచారు. బతుకమ్మను తలపై ఎత్తుకొని వారితో మమేకమయ్యారు. దాంతో అన్నకు తగ్గ వదినమ్మ అంటూ మహిళలు మాధురిని చూసి ఆనందంతో పొంగిపోయారు. ఆమెతో ఫొటోలు దిగారు.

మాధురి ఆదివారం రాత్రి గడపగడపకు కాంగ్రెస్ కార్యక్రమం నిర్వహించారు. ప్రచార రథం పై వీధి వీధిన తిరుగుతూ.. కాంగ్రెస్ కు పట్టం కట్టాలని కోరారు. ఈ సందర్భంగా స్థానిక మహిళలు కోలాటం నృత్యాలతో సందడి చేశారు. పొంగులేటి మాధురి వారితో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తామన్నారు. కార్యక్రమంలో పొంగులేటి ప్రసాద్ రెడ్డి  సతీమణి పొంగులేటి శ్రీ లక్ష్మి,  శాఖమూరి రమేష్, వంగూరు వెంకటేశ్వర్లు, ఎంపీటీసీ వంగూరి ఉష, ఉప సర్పంచ్ కందుల వెంకటేశ్వరరావు, లిక్కి వీరబాబు, పాలడుగు అప్పారావు, జల్లేపల్లి నాగేశ్వరరావు, రావెళ్ళ కిషన్, పాలడుగు పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.