Read News in Telugu Language
adsdaksha

అన్నమీద ప్రేమతో తమ్ముడిని భుజంపై ఎత్తుకొన్న కాంగ్రెస్ శ్రేణులు..

దక్ష న్యూస్, ఖమ్మం అక్టోబర్ 31

ఆనందంతో తబ్బుబ్బయిన ప్రసాద్ రెడ్డి..

పొంగులేటి గెలుపు పట్ల భారీ భరోసా..

పొంగులేటి శ్రీనన్నను పాలేరు స్థానం నుంచి భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని తెలుపుతూ.. ఆయన సోదరుడు, కాంగ్రెస్ జిల్లా నాయకులు
పొంగులేటి ప్రసాద్ రెడ్డి ( ponguleti prasad reddy ) ని ఆ పార్టీ శ్రేణులు భుజాలకి ఎత్తుకొని ఊరేగింపు తీసి అభయమిచ్చారు. ఖమ్మం రూరల్ మండలం పొలిశెట్టి గూడెంలో మంగళవారం రాత్రి ఈ ఆత్మీయ ఘటన చోటుచేసుకుంది. కోలాటం నృత్యాలు, డప్పుల మోతలతో తమ గ్రామం లోకి వచ్చిన ప్రసాదరెడ్డి కి కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. దాంతో ఆ గ్రామం అంతా సందడి నెలకొంది. కళ్లెం వెంకటరెడ్డి, అల్లం వీరారెడ్డి, మాచారపు శ్రీనివాసరావు, బాబు, మద్ది వీరారెడ్డి తదితరులు ప్రసాదరెడ్డి తో పాటు ప్రచారం లో పాల్గొన్నారు.

Hospital

read also : పాలేరుకి పొంగులేటి స్పెషల్ గ్యారెంటీలు…!

బత్తుల సోమయ్యను కలిసిన పొంగులేటి ప్రసాద్ రెడ్డి ..

తెలంగాణ ఉద్యమకారుల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు బత్తుల సోమయ్యను కాంగ్రెస్ జిల్లా నాయకులు పొంగులేటి ప్రసాద్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. బారుగూడెంలోని ఆయన నివాసానికి మంగళవారం వెళ్లి మాట్లాడారు. పొంగులేటి శీనన్నకు మద్దతివ్వాలని, భారీ మెజారిటీ తో గెలిపించుకుందామని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కళ్లెం వెంకట రెడ్డి, నాయకులు గుమ్మా రోషయ్య, సత్యనారాయణ, దాసరి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.