Read News in Telugu Language
adsdaksha

వచ్చే హోలీ నాటికి అర్హులంతా కొత్త ఇందిరమ్మ ఇళ్లలో ఉంటారు..

దక్ష న్యూస్, హైదరాబాద్: మార్చి 24 -

– ఆరు గ్యారంటీలతో అందరికీ లబ్ధి : కాంగ్రెస్ జిల్లా నాయకులు పొంగులేటి ప్రసాద్ రెడ్డి..

అర్హులైన ప్రతి పేదవాడికి రాష్ట్ర ప్రభుత్వం సొంతింటి కల నెరవేర్చబోతోందని.. వచ్చే హోలీ నాటికి పేదలంతా ఇందిరమ్మ కొత్త ఇళ్లల్లో ఉంటారని కాంగ్రెస్ జిల్లా నాయకులు పొంగులేటి ప్రసాద్ రెడ్డి ( ponguleti prasad reddy ) అన్నారు. ఆదివారం అయన కూసుమంచి లోని మంత్రి పొంగులేటి శీనన్న క్యాంపు కార్యాలయంలో గిరిజన మహిళలు, నాయకులతో కలిసి ముందస్తుగా రంగుల పండుగ సంబరాలు జరుపుకున్నారు.

Read also: జోగినపల్లి సంతోష్‌కుమార్‌పై కేసు.. బంజారాహిల్స్‌ పీఎస్ లో చింతా మాధవ్ ఫిర్యాదు..

Hospital

ఈ సందర్భంగా ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ..ఇచ్చిన మాట ప్రకారం ఆరుగ్యారంటీల అమలు ఆరంభమైందని, అర్హులందరికీ లబ్ధి చేకూరుతోందని అన్నారు. ప్రాధాన్యం ప్రకారం అందరికీ న్యాయం జరిగేలా మన పొంగులేటి శీనన్న కృషి చేస్తున్నారని అన్నారు. ఈ హోలీ పండుగను అంతా సంతోషంగా, సంబరంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.

Read also: ప్రధాని మోదీ భూటాన్‌ టూర్.. ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం‘డ్రుక్ గ్యాల్పో’ ప్రధానం ..

సతీమణి శ్రీలక్ష్మి తో కలిసి ప్రసాదరెడ్డి వివిధ తండాల నుంచి వచ్చిన  బంజారా మహిళలతో ముచ్చటించారు. సంప్రదాయబద్ధంగా జరుపుకునే హోలీ వేడుకల విశేషాలు వారి మాటల్లోనే తెలుసుకున్నారు. ఆ తర్వాత అందరికీ హోలీ శుభాకాంక్షలు తెలిపారు.

కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, పొంగులేటి అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.