Read News in Telugu Language
adsdaksha

ఆరు గ్యారెంటీలతో అందరికీ మేలు .. కాంగ్రెస్ తోనే ప్రజా సంక్షేమం ..

దక్ష న్యూస్, ఖమ్మం: అక్టోబర్ 13

– కాంగ్రెస్ జిల్లా నాయకులు పొంగులేటి ప్రసాద్ రెడ్డి..

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితేనే ప్రజలందరికీ సంక్షేమం దక్కుతుందని కాంగ్రెస్ పార్టీ ( congress party ) జిల్లా నాయకులు పొంగులేటి ప్రసాద్ రెడ్డి ( ponguleti prasad reddy ) అన్నారు. శుక్రవారం ఆయన తిరుమలాయపాలెం ( thirumalayapalem ), పిండిప్రోలు ( pindiprolu ), గోల్ తండా ( goll thanda ), పాతర్లపాడు ( patarlapadu ), బీసరాజ్ పల్లి తండా ( bisaraju palli thanda ), పాపాయి గూడెం ( papayigudem ) తదితర గ్రామాల్లో పర్యటించారు. ఆయా గ్రామాల్లో అనేక కుటుంబాలను కలిశారు. ఇటీవల వివిధ కారణాలతో మరణించిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రమాదాలతో గాయపడిన వారిని కలిసి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి పలుచోట్ల మాట్లాడుతూ..వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని అన్నారు.

Hospital

read also : సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెడితే కఠిన చర్యలు ..

ఆరు గ్యారెంటీలతో అన్ని కుటుంబాలకు లబ్ధి కలుగుతుందని పొంగులేటి ప్రసాద రెడ్డి భరోసా ఇచ్చారు. ఈ పర్యటనలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు, జెడ్పీటీసీ బెల్లం శ్రీను, పాలేరు నియోజకవర్గ నాయకులు చావా శివరామకృష్ణ, మాజీ ఎంపీపీ కొప్పుల అశోక్, అరవింద్ రెడ్డి, జాలా కిరణ్, పోట్ల కిరణ్, జడల నగేష్, జడల రమేష్, గోళ్ల లింగయ్య, సైఫుద్దీన్, చామకూరి రమేష్, తాటికొండ కిరణ్, దొడ్డా గురువయ్య, చల్లా వెంకటేశ్వర్లు, పోట్ల ప్రవీణ్, సైదా, ఫయాజ్, ఇమామ్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.