Read News in Telugu Language
adsdaksha

జన నీరాజనం..

దక్ష న్యూస్, ఖమ్మం: అక్టోబర్ 23

పొంగులేటికి ఘన స్వాగతం పలికిన రామన్నపేట వాసులు ….

విజయదశమి పర్వదినం వేళ తమ మధ్యకు వచ్చిన కాంగ్రెస్ ( congress ) ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ( ponguleti srinivas reddy ) కి జన నీరాజనం ఉక్కిరిబిక్కిరి చేసింది. అంతులేని అభిమానంతో పూల వర్షం కురిపించిన అభిమానుల ఆప్యాయత ఆయనను కదిలించి వేసింది. పొంగులేటి రాక కు స్థానిక కళాకారులు కోలాటాలు.. నృత్యాలతో ఘనంగా ఆహ్వానం పలికారు.

ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా సోమవారం పొంగులేటి శీనివాసరెడ్డి రామన్న పేట ( ramannapeta )లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన రాకను తెలుసుకున్న స్థానిక పరిసర ప్రాంతాల ప్రజలు ఆయన వెంట ప్రచారానికి వేలాదిగా స్వచ్చందంగా తరలి వచ్చారు. గ్రామంలో అడుగుపెట్టిన పొంగులేటి పై పూల వర్షం కురిపించి అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ, ప్రజలందరికీ విజయదశమి పర్వదిన శుభకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా జరుపుకునే విజయదశమి పర్వదినం సందర్భంగా ప్రజలను మోసపూరిత వాగ్ధానాలతో మభ్యపెట్టిన బీఆర్ఎస్ పార్టీ ని ఓడించడం ద్వారా ప్రజలు విజయం సాధించాలని ఆకాంక్షించారు.

read also : వదిన బైలెల్లినాదో..

Hospital

తెలంగాణను ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడం ద్వారా ప్రజలు సురక్షితమైన కాంగ్రెస్ పాలనలో మన రాష్ట్రాన్ని అభివృద్థి పధంలో నడిపించాని కోరారు. ప్రజల ఆశీస్సులు, దీవెనలతో నే కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుందని, డిసెంబర్ 9న కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని ఆశాభావం వ్యక్తం చేశారు.

అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం అని ఈ సందర్భంగా పొంగులేటి తెలిపారు. మాయమాటలతో కెసిఆర్ రెండు పర్యాయాలు అధికారంలోకి వచ్చాడని, కాసులకు కక్కుర్తి పడి పేపర్ లీకేజీ చేసి నిరుద్యోగులను వంచించాడన్నారు. ఇందిరమ్మ రాజ్యం వచ్చిన మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని పొంగులేటి తెలిపారు.

read also : తెలంగాణ ప్రజాప్రతినిధుల నేర చరిత్ర.. అధికార పార్టీలోనే 59 మంది..

కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉచిత కోచింగ్ కి కూడా కావాల్సిన ఏర్పాట్లు చేస్తామన్నారు. కెసిఆర్ కబ్జా చేసిన లక్ష కోట్ల ఆస్తులను రికవరీ చేసి, ఆ రికవరీ సొమ్ముతో పేద , మధ్య తరగతి ప్రజలకు న్యాయం చేస్తామన్నారు. ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోని రామన్నపేట లోని డంపింగ్ యార్డు సమస్యను పరిష్కరించే బాధ్యత నాదే. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే ఈ సమస్యకు పరిష్కారం చూపుతామని హామీ ఇస్తున్నా అంటూ భరోసా ఇచ్చారు.

బీఆర్ఎస్ నేతలు డబ్బు సంచులతో బయలు దేరారు. అది మీ సొమ్మే తీసుకోని ప్రజల బాగు కోరే కాంగ్రెస్ పార్టీ గుర్తు హస్తానికి ఓటు వేయండన్నారు. రామన్న పేట కాంగ్రెస్ అడ్డా. పక్కా మీరు కాంగ్రెస్ పార్టీ కి ఓటు వేసి ఆశీర్వదిస్తారు ఆ విషయం నాకు బాగా తెల్సు ఎప్పటికీ మీ ఆశీర్వాదం నా పైన… కాంగ్రెస్ పార్టీ పైన ఉండాలన్నారు.

Leave A Reply

Your email address will not be published.