Read News in Telugu Language
adsdaksha

వైరా సీటు మనదే….! పొత్తుల్లో పోతుందనడంలో నిజం లేదు..

దక్ష న్యూస్, ఖమ్మం: అక్టోబర్ 24

– కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని అఖండ మెజారిటీతో గెలిపించాలి

– సిరిపురంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి..

పొత్తుల్లో వైరా సీటు పోతుందనడంలో నిజం లేదని తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ( ponguleti srinivas reddy ) అన్నారు. కొంతమంది కావాలనే అసత్యపు ప్రచారం చేస్తున్నారని, ఆ మాటలు నమ్మకుండా కాంగ్రెస్ పార్టీ తరుపున వైరా ( wyra ) బరిలో ఉండే మన అభ్యర్థిని ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. మంగళవారం వైరా నియోజక వర్గంలోని సిరిపురం ( siripuram ) గ్రామంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనానికి శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, బీజేపీ ( bjp ), బీఆర్ఎస్ ( brs )  పార్టీలు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయన్నారు. తెలంగాణ ( telangana ) ఇచ్చిన సోనియమ్మ ను కాదని ప్రజలు రెండు సార్లు కేసీఆర్ ( kcr ) కి అధికారం ఇస్తే ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా చేశాడని విమర్శించారు.

read also : జన నీరాజనం..

Hospital

ఐదు లక్షల కోట్లు అప్పు చేసి అందులో లక్ష కోట్లు అప్పనంగా నొక్కేశాడని శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. ప్రజల బాగు కోరుకుంటున్నానని అబద్దపు మాటలు చెప్పి మోసం చేశాడన్నారు. మళ్ళీ మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నాడని కానీ ఆ మాటలు నమ్మే స్థితిలో తెలంగాణ ప్రజలు లేరన్నారు. కర్ణాటక లో ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడం జరిగిందని, తెలంగాణలో సోనియమ్మ ఇచ్చిన ఆరు గ్యారెంటీ లను కూడా హస్తం పార్టీ అధికారంలోకి రాగానే నెరవేర్చి చూపుతామని హామీ ఇచ్చారు. రైతులు, మహిళలు, నిరుద్యోగులు ఇలా అన్ని వర్గాల వారికి న్యాయం జరగాలంటే ఇందిరమ్మ రాజ్యం రావాలన్నారు.

read also : వదిన బైలెల్లినాదో..

ఇందిరమ్మ రాజ్యం కోసం ప్రజలంతా ఓటు వేసి దీవించాలన్నారు.
రాహుల్ గాంధీ బస్ యాత్రలో ఎప్పుడెప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలా అనే తపన ప్రజల్లో గమనించామని, వైరా రిజర్వాయర్ సమస్యకు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక శాశ్వత పరిష్కారం చూపిస్తాం అన్నారు. డిసెంబర్ 9న ప్రజల అశీస్సులు దీవెనలతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం చేయనున్నారంటూ తన ప్రసంగాన్ని ముగించారు.

read also :తుమ్మల వైఖరి కుక్కతోక పట్టుకొని గోదారి ఈదినట్లు ఉంది : పగడాల నాగరాజు

కార్యక్రమంలో వైరా నియోజక వర్గ నాయకురాలు బానోతు విజయబాయి, రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, మచ్చా వెంకటేశ్వరరావు, మట్టూరి నాగేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.