Read News in Telugu Language
adsdaksha

పాలేరు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వందకుటుంబాలు చేరిక..

దక్ష న్యూస్, ఖమ్మం: అక్టోబర్ 29

కండువాలు కప్పి ఆహ్వానించిన పొంగులేటి..

ఎన్నికల వేళ పాలేరు రాజకీయాల్లో చిత్ర విచిత్ర పరిస్థితులు చోటు చేసుకుంటుంన్నాయి. ఇప్పుడు ఒక పార్టీలో ఉన్న వారు సాయంత్రానికి ఏపార్టీలో జంప్ అవుతారో తెలియని పరిస్థితి నెలకొంది. అయితే ఇంతకాలం బిఆర్ఎస్ హామీలతో విసిగిపోయామని చెప్పుతున్న కొందరు బిఆర్ఎస్ నాయకులు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తమ వద్దకు ప్రచారానికి వస్తున్న నేతల హామీలతో పార్టీలు మారిపోతున్నారు.

read also : బీజేపీకి రాజీనామా చేస్తా : బాబు మోహన్

తాజాగా తెలంగాణ కాంగ్రెస్ ( congress ) ప్రచార కమిటీ కో చైర్మన్, పాలేరు ( paleru ) నియోజకవర్గ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ( ponguleti srinivas reddy ) సమక్షంలో ఆదివారం ఖమ్మం రూరల్ మండలం కామంచికల్ ( kamanchikal ), ముత్యాలగూడెం ( mutyalagudem ), పాటివారి గూడెం ( pativarigudem ) గ్రామాలకు చెందిన సుమారు వందకు పైగా కుటుంబాలు బీఆర్ఎస్ ( brs ) పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. వారందరికీ పొంగులేటి తన క్యాంపు కార్యాలయంలో కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారందరికీ సముచిత ప్రాధాన్యత కల్పిస్తామని హామీ ఇచ్చారు.

Hospital

కూసుమంచి మండలం లాల్ సింగ్ తండాకు చెందిన పలువురు బీఆర్ ఎస్ ( brs )  నాయకులు భూక్య కృష్ణమూర్తి ఆధ్వర్యంలో ఆదివారం ఖమ్మంలోని పొంగులేటి క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్లో చేరారు. వీరికి కాంగ్రెస్ జిల్లా నాయకులు పొంగులేటి ప్రసాద్ రెడ్డి ( ponguleti prasad reddy ) పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ, పొంగులేటి శీనన్న, మీకు ఎప్పుడూ అండగా ఉంటారని ప్రసాదరెడ్డి హామీ ఇచ్చారు. కాంగ్రెస్లో చేరిన వారిలో ఇద్దరు వార్డు సభ్యులు ధరావత్ హచ్ఛా, గుగులోతు వసంత శ్రీను, నాయకులు బాదావత్ గ్యామా, హత్తా, గుగులోతు సురేష్, శ్రీను, గుగులోతు భాస్కర్, మల్సూర్, ధరావత్ లాల్ సింగ్, నాగేశ్వరరావు తదితరులు ఉన్నారు.

అనంతరం కూసుమంచి మండలం హీరామన్ తండాకు చెందిన సర్పంచ్ మూడు కోట్యా, వార్డు మెంబర్లు మూడు రవి, తేజావత్ బుజ్జి శ్రీనుతో పాటు మరికొంతమంది బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లోకి చేరారు. మాజీ ఎంపీపీ జూకూరి గోపాలరావు ( jukuri gpalrao ) ఆధ్వర్యంలో చేరిన వీరందరికీ పాలేరు నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఎస్ఆర్ కన్వెన్షన్లో జరిగిన ఓ కార్యక్రమంలో కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకురాలు మద్దినేని బేబి స్వర్ణకుమారి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.