Read News in Telugu Language
adsdaksha

జనవరిలోనే ఆర్ సీసీ వాల్ నిర్మాణం..

దక్ష న్యూస్, ఖమ్మం: అక్టోబర్ 29

హామీలు నెరవేరిస్తేనే ఓట్లడుగుతా..

* ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ కాలనీకి రోడ్లు, డ్రెయిన్ లు

* కాంగ్రెస్ ను మించిన లౌకిక పార్టీ మరొకటి లేదు..

* నాల్గో తరగతి ఉద్యోగుల కాలనీ ఆత్మీయ సమ్మేళనంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి..

* శ్రీనివాసరెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ క్రైస్తవ సోదరుల ప్రార్థనలు..

Hospital

” ఒక్కసారి ఎమ్మెల్యే అయితే చాలు.. అంతటితో ఆగిపోదాం అనుకునే మనస్తత్వం మీ శీనన్నది కాదు.. ఓట్లేసి గెలిపించిన ప్రజలను అట్టిపెట్టుకొని.. ఇచ్చిన హామీలను నెరవేర్చాకే మళ్లీ మీ మధ్యకు వస్తాను ” అని కాంగ్రెస్ పాలేరు నియోజకవర్గం అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ( ponguleti srinivas reddy ) మాటిచ్చారు. ఖమ్మం ( khammam ) రూరల్ మండలం కరుణగిరి సమీపంలోని ఫోర్త్ క్లాస్ ఎంప్లాయిస్ కాలనీలో ఆదివారం ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ప్రసంగించారు. 20 ఏళ్ల క్రితం ఏర్పడిన నాలుగో తరగతి ఉద్యోగుల కాలనీలో మౌలిక సదుపాయాలు కూడా లేవని, స్థానిక ఎమ్మెల్యే ( mla ) కు మొరపెట్టుకున్నా ప్రయోజనం లేకుండా పోయిందని కాలనీవాసులు పొంగులేటి దృష్టికి తీసుకువచ్చారు.

మొన్నటి మున్నేరు వరద ముంపుతో తాము పడిన ఇబ్బందులను వారు ఏకరువు పెట్టారు. దీనిపై స్పందించిన పొంగులేటి ” రాబోయేది ఇందిరమ్మ రాజ్యం.. కాంగ్రెస్ ప్రభుత్వం.. మీ అందరి ఆశీర్వాదంతో నేను పాలేరు ఎమ్మెల్యేగా ఎన్నికవుతా.. డిసెంబర్ లోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఆ వెంటనే జనవరిలోనే ఆర్ సీసీ వాల్ నిర్మాణం చేపడుతాం.. ఖమ్మం శివారులో గత ప్రభుత్వం నిర్మించిన చెక్ డ్యాం కారణంగానే మున్నేరు ముంపు తీవ్రత అధికంగా ఉంది. ఖమ్మం శివారు వరకు మున్నేరుపై ఎక్కడ చెక్ డాములు లేకుండా… బ్యాక్ వాటర్ పోటెత్తకుండా ఆర్సీసీ వాల్ నిర్మాణం చేపడతామని” అన్నారు.

read also : పాలేరు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వందకుటుంబాలు చేరిక..

ఖమ్మం నగరానికి ఆనుకొని ఉన్నా కనీస వసతులకు కూడా నోచుకోకుండా ఉన్న నాలుగో తరగతి ఉద్యోగుల కాలనీలో తాను ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన వెంటనే సీసీ రోడ్ల నిర్మాణం, డ్రైనేజీల ఏర్పాటు, తదితర సౌకర్యాలు మెరుగుపరుస్తానని పొంగులేటి హామీ ఇచ్చారు. ఈ ఒక్కసారి ఎమ్మెల్యే అయ్యి ఆగిపోవాలని తాను అనుకోవడం లేదని, ప్రజాసేవ చేసుకునే వయసు తనకెంతో ఉందని అందుకే మరో మారు మిమ్మల్ని ఓటు అడగాల్సి వస్తే.. ఇచ్చిన హామీలు నెరవేర్చాకేనన్నారు. ” సర్వ కుల, మత సమ్మిళితంగా ఉన్న నాలుగో తరగతి ఉద్యోగుల కాలనీ వాసులకు నా విజ్ఞప్తి ఒక్కటే… బీఆర్ఎస్ కు ఓటేస్తే బిజెపికి ఓటేసినట్లే.. కాంగ్రెస్ ను మించిన లౌకిక పార్టీ మరొకటి లేదనే విషయాన్ని గుర్తెరిగి ఓటేయాల్సిందిగా ” విజ్ఞప్తి చేశారు.

స్థానిక పాస్టర్ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో క్రైస్తవ సోదరులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి విజయాన్ని, రాష్ట్రంలో కాంగ్రెస్ మెజార్టీ స్థానాలు సాధించాలని కాంక్షిస్తూ ప్రార్థనలు చేశారు. ఈ సమ్మేళనంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు రాయల నాగేశ్వరరావు, మద్దినేని బేబీ స్వర్ణకుమారి తదితరులు మాట్లాడారు. ఫోర్త్ క్లాస్ ఎంప్లాయిస్ కాలనీ వాసులంతా పొంగులేటి కి మద్దతు తెలియజేశారు.

Leave A Reply

Your email address will not be published.