Read News in Telugu Language
adsdaksha

పాలేరుకి పొంగులేటి స్పెషల్ గ్యారెంటీలు…!

దక్ష న్యూస్, ఖమ్మం: అక్టోబర్ 30

అన్ని వర్గాలకు అనువుగా ఆరు హామీలు..

నేలకొండపల్లి ఎన్నికల ప్రచారంలో శీనన్న మాట ఇస్తే తప్పడని వ్యాఖ్య..

పాలేరు నియోజకవర్గ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ నియోజకవర్గంలోని ప్రధానమైన ఆరు గ్యారెంటీల అమలుకు కృషి చేస్తానని తెలంగాణ ( telangana ) కాంగ్రెస్ ప్రచార కమిటీ కో చైర్మన్, పాలేరు ( paleru ) నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ( ponguleti srinivas reddy ) పేర్కొన్నారు. సోమవారం నేలకొండపల్లి ( nelakondapalli ) మండలంలోని ఆచర్ల గూడెం, ఆరెగూడెం, కోనాయిగూడెం, కోరట్ల గూడెం, అమ్మగూడెం, రాజేశ్వరపురం, శంకరగిరి తండా, ముఠాపురం తదితర గ్రామాల్లో పొంగులేటి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, మీకు తెలుసు గత పదేళ్లుగా నన్ను చూస్తూ వస్తున్నారు. నేను మాట ఇచ్చానంటే అది చేసి చూపిస్తా… అందుకోసం ఎక్కడిదాకా అయినా వెళ్తా…! మీ సాక్షిగా చెబుతున్నా పాలేరు అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేస్తున్న నన్ను గెలిపించండి… మీ దీవెనలతో కాంగ్రెస్ పార్టీనే రాష్ట్రంలోనూ అధికారంలోకి రాబోతుంది… అధికార పార్టీ ఎమ్మెల్యేగా నేను గెలిచిన ఏడాదిలోనే పాలేరు నియోజకవర్గానికి ఆరు గ్యారెంటీలను అమలు చేసి చూపిస్తా… ఇది పాలేరు నియోజకవర్గ అన్ని వర్గాల ప్రజలకు స్పష్టమైన హామీ అన్నారు.

read also : ప్రసాద్ రెడ్డి సమక్షంలో జెడ్పీటీసీ బెల్లం శ్రీను పుట్టినరోజు వేడుక ..

ప్రచారానికి వచ్చిన పొంగులేటి శ్రీనివాసరెడ్డికి స్థానికులు ఘనస్వాగతం పలికారు. ప్రచార రథంపై అభివాదం చేసుకుంటూ… ఓట్లను అభ్యర్థిస్తూ ఆయన తన
పర్యటనను కొనసాగించారు. ఈ సందర్భంగా పాలేరుకి ఆరు గ్యారెంటీల ప్రత్యేక హామీ పోస్టర్ను ఆవిష్కరించారు.

ఇవే ప్రత్యేక హామీలు..

Hospital

1) పరిపాలన మౌలిక సదుపాయాల్లో భాగంగా ఆర్సీసీ వాల్ నిర్మాణం, మున్నేరు వరదలకు శాశ్వత పరిష్కారం, రూరల్ మండలంలో లేఔట్ల క్రమబద్ధీకరణ, పాలేరులో కొత్త బస్ టెర్మినల్, బచ్చోడు, బీరోలు, బంగ్లా రూట్ వంటి బస్ సర్వీసులు పునరుద్ధరణ.

2) విద్య-యువత విషయానికొస్తే ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూలు ఏర్పాటు, ఇంటర్, డిగ్రీ పాస్ అయిన అర్హులైన యువతకు ప్రతి ఏటా జాబ్ మేళ, మత్స్య పరిశోధన కేంద్రంకు కావాల్సిన శిక్షణ గదులు, ఆడిటోరియం నిర్మాణం, ప్రతి మండలంలో యువత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్కు స్టడీ సర్కిల్స్ ఏర్పాటు, పాలేరు ప్రజలకు అందుబాటులోకి డిగ్రీ కాలేజీని
తీసుకొస్తా.

3) వైద్యం – అధ్వాన్యంగా ఉన్న ప్రభుత్వ 30 పడకల ఆసుపత్రులను 50 పడకల ఆసుపత్రులుగా మార్పు చేయిస్తా… తండాలకు కూసుమంచి, తిరుమలాయపాలెం మండల కేంద్రాలుగా డెడికేటెడ్ అంబులెన్సు సర్వీస్ ఏర్పాటు చేయిస్తా…

4) వ్యవసాయం – సీతారామ ప్రాజెక్టు, కెనాల్ పనులు పూర్తి చేసి తిరుమలాయపాలెం,
కూసుమంచి మండలాలల్లో ఆయకట్టు విస్తరణ, పూర్తిస్థాయిలో మద్దులపల్లి మార్కెట్ యార్డ్ అభివృద్ధి, పాలేరు చేపల ఆధారిత ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ స్థాపన.

read also : డాక్టర్ శీలం పాపారావు.. మనలో ఒకరు..

5) సంక్షేమం – శంకుస్థాపనతో నిలిచిపోయిన ఎస్సీ కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం పూర్తి. బీసీ, ఎస్టీ కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం. అర్హులైన ప్రతి ఒక్కరికి గృహలక్ష్మి పథకం ద్వారా ఇందిరమ్మ ఇళ్లు కట్టించేందుకు కృషి.

6) పద్మ శ్రీ వనజీవి రామయ్య స్ఫూర్తితో ఆరోహామీని కూడా ఇస్తున్నా. డంపింగ్ యార్డ్ దానవాయిగూడెం నుంచి తరలింపు, పాలేరు చెరువు, బుద్ధ స్తూపం, తీర్ధల క్షేత్రం
పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి.

మీ శీనన్న మాట ఇస్తున్నాడు… తప్పేది లేదంటూ తన పొంగులేటి తన ప్రసంగాన్ని ముగించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.